Hanuman Theatres Issue : ప్రస్తుతం యావత్ సినీ ప్రియులు జై హనుమాన్(Jai Hanu-Man) స్మరణతో థియేట్సర్ హోరెత్తిస్తున్నారు. ఈ సంక్రాంతి(Sankranti) కి ఇంటిల్లిపాదీ చూడదగ్గ అసలు సిసలు సినిమా అంటూ జనాలు క్యూ కడుతున్నారు. వసూళ్లతో సునామీ సృష్టిస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది. హిట్ డిమాండ్ బట్టి థియేటర్స్ పెంచుతారా ? అంటే ..అది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది. ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ చిత్రానికి థియేటర్స్ కరువయ్యాయి. వీళ్లకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా చేసేసరికి హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి, మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ టియఫ్పీసీ లో కంప్లైట్ చేయడంజరిగింది.
అగ్రిమెంట్ భేఖాతరు చేసిన థియేటర్స్ -ఇస్స్యూ పై టీఎఫ్‌పీసీకి ఫిర్యాదు
ఏ సినిమానయినా ప్రదర్శించేటప్పుడు ముందుగా ఆయా నిర్మాత, పంపిణీ దారులతో అగ్రిమెంట్ చేసుకుంటారు థియేటర్(Theater) యాజమాన్యం. అయితే .. అగ్రమెంట్ ప్రకారం ఆ సినిమాకు థియేటర్స్లో ప్రదర్సన వేయకపోతే నష్టం నిర్మాతలు, పంపిణీదారులపై పడుతుంది. ఇలాంటి సమస్యే హనుమాన్ సినిమాకు వచ్చి పడింది . థియేటర్లు అగ్రీమెంటు ప్రకారం హనుమాన్(Hanu-Man) సినిమా ప్రదర్శన చేయకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఆపార నష్టం వాటిల్లిన నేపథ్యంలో ఆయా థియేటర్లు తక్షణమే హనుమాన్ సినిమా ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన నష్టం భరించాలని నిర్మాతలు తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలిని కోరారు. .
టీఎఫ్‌పీసీ రియాక్షన్
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు మేరకు ఈ ఇష్యూ మీద టీఎఫ్‌పీసీ స్పందించింది.మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పీ వారు హనుమాన్ సినిమా జనవరి 12 నుంచి ప్రదర్శించడానికి తెలంగాణాలో కొన్ని థియేటర్లు వారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. . కానీ ఆ థియేటర్ల వారు ఈ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ నైజాం ఏరియా థియేటర్ల లో హనుమాన్ సినిమా ప్రదర్శన చేయలేదని చలన చిత్ర నిర్మాతల మండలి సీరియస్ అయింది.
హనుమాన్ సినిమాకి సత్వర న్యాయం
థియేటర్ యాజమాన్యాల చర్యల వల్ల తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం అని టీఎఫ్‌పీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తోందంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ నమ్మకం నైతికత నిబద్దత న్యాయం ఆధారంగా ముందుకు నడిచే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ప్రదర్శకులు వారి పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ హనుమాన్ సినిమాకి సత్వర న్యాయం చేయాలనీ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరింది.
ALSO READ : ఆ లెక్కన గుంటూరు కారం హిట్టా .. ఫట్టా ?