Israel-Hamas war: శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్‌ దాడిలో బందీలు మృతి: హమాస్

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు తాజాగా గాజా శివార్లలోని ఓ శరణార్థ శిబిరంలో జరిగిన దాడిలో ఏడుగురు బందీలు మృతి చెందినట్లు హమాస్ తెలిపింది. అంతకుముందు కూడా తమ వద్ద బందీలుగా ఉన్నవాళ్లలో సుమారు 50 మంది మృతి చెందినట్లు చెప్పింది.

Hamas-Israel War: ఇంకా కొనసాగుతున్న దాడులు.. గాజాలో 25 వేల మందికిపైగా మృతి
New Update

హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతోంది. అయితే ఈ క్రమంలో గాజా నగర శివార్లలోని జాబిలియా శరణార్థ శిబిరంలోని అపార్ట్‌మెంట్‌పై జరిగిన బాంబు దాడిలో భారీగా ప్రాణనష్టం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఏడుగురు బందీలు మరణించినట్లు హమాస్ తెలిపింది. అయితే ఈ దుర్ఘటనలో ఏడుగురు బందీలు మరణించినట్లు హమాస్ తెలిపింది. అయితే వారిలో విదేశీ పాస్‌పోర్టు కలిగిన ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నట్లు చెప్పింది. అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు దాడికి పాల్పడి, కొంతమందిని బందీలుగా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్య దాదాపు 240 దాకా ఉండొచ్చని ఇజ్రాయెల్‌ చెబుతోంది. అయితే ఇప్పుడు వాళ్లలోనే ఏడుగురు మృతి చెందినట్లు హమాస్‌ పేర్కొంది. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ఇక, అంతకుముందు కూడా తమ వద్ద బందీలుగా ఉన్నవాళ్లలో సుమారు 50 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అయితే వాళ్లందరూ ఇజ్రాయెల్‌ దాడుల వల్లే చనిపోయారని ప్రకటించింది.

Also Read: ఇన్ఫోసిస్‌ మరో కీలక నిర్ణయం..ఉద్యోగులు ఆ 10 రోజులు..!

ఇదిలా ఉండగా.. నిన్న శరణార్థ శిబిరంపై జరిగిన దాడిలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అలాగే వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలైనట్లు పాలస్తీనా అధికారులు పేర్కొన్నారు. అలాగే మరోవైపు ఈ ఘటనలో హమాస్‌ కమాండర్ ఇబ్రహీం హతమైనట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కానీ ఈ వార్తలను హమాస్‌ తోసిపుచ్చింది. ఆ శిబిరంలో తమ నేతలెవరూ లేరని చెప్పింది.

Also read: అగ్రరాజ్యంలో తెలంగాణ విద్యార్థి పై దాడి..పరిస్థితి విషమం!

#hamas-vs-israel #hamas-israel-war #gaza
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe