Hair Care Tips: హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందా? ఇలా చేస్తే ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు!

హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందా? హెల్మెట్ జుట్టు రాలడానికి కారణమైతే, దానిని నివారించడానికి ఏవైనా నివారణలు ఉన్నాయా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతాయి. మరి హెల్మెట్ ధరించడం వలన అసలేం జరుగుతుందో పూర్తి సమాచారం తెలుసుకుందాం. వాస్తవానికి హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలిపోదని నిపుణులు చెబుతున్నారు. గాలి సరిగా రాని హెల్మెట్ ధరిస్తే మాత్రం జుట్టు రాలిపోయే అవకాశం ఉందంటున్నారు.

Hair Care Tips: హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందా? ఇలా చేస్తే ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు!
New Update

Hair Care Tips: బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే భయపడుతున్నారా? హెల్మెట్(Helmet) ధరిస్తే జుట్టు రాలిపోతుందని ఆలోచిస్తున్నారా? ఒకవేళ హెల్మెట్ ధరించడం వలన జుట్టు(Hair Loss) రాలుతున్నట్లయితే.. దానికి నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా? జుట్టు రాలకుండా ఏం చేయాలి? చాలా మంది ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్య గురించి ఇవాళ మనం తెలుసుకుందాం.. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. భద్రతా పరంగా కూడా చాలా ముఖ్యం. అయితే, జుట్టు రాలిపోతుందనే భయంతో చాలా మంది రైడర్లు హెల్మెట్ వాడకుండా ఉంటారు. చలాన్లు చెల్లించేందుకైనా రెడీగా ఉంటారు కానీ.. హెల్మెట్ మాత్రం ధరించరు.

అయితే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందా? హెల్మెట్ జుట్టు రాలడానికి కారణమైతే, దానిని నివారించడానికి ఏవైనా నివారణలు ఉన్నాయా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతాయి. మరి హెల్మెట్ ధరించడం వలన అసలేం జరుగుతుందో పూర్తి సమాచారం తెలుసుకుందాం. వాస్తవానికి హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలిపోదని నిపుణులు చెబుతున్నారు. అయితే, గాలి సరిగా రాని హెల్మెట్ ధరిస్తే మాత్రం జుట్టు రాలిపోయే అవకాశం ఉందంటున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలదు కానీ.. సరికాని హెల్మెట్ కారణంగా జుట్టు రాలే సమస్యను పెంచుతుందని చెబుతున్నారు.

Also Read:డిజిటల్ ప్రపంచానికి దూరంగా పిల్లలను పెంచడం ఎలా?

హెల్మెట్ ధరించినా జుట్టు రాలే సమస్యను అరికట్టే చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించడం వలన జుట్టు రాలే సమస్య అస్సలు రాదని నిపుణులు చెబుతున్నారు. మరి జుట్టు రాలకుండా ఉండాలంటే హెల్మెట్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మొదటగా.. సరైన వెంటెడ్ హెల్మెట్‌ని ఎంచుకోవాలి. హెల్మెట్‌కు సరైన వెంటిలేషన్ లేకపోతే, లోపల చేరిన చెమట నెత్తిమీద బ్యాక్టీరియాను పుట్టిస్తుంది. ఇది జుట్టు రాలడం, చుండ్రు, ఇతర స్కాల్ప్ సమస్యలకు దారితీస్తుంది.

హెల్మెట్ పెట్టుకునే ముందు తలపై హెల్మెట్ లైనర్ లేదా క్యాప్ పెట్టుకోవడం కూడా ప్రయోజనకరం. ఇది జుట్టు, హెల్మెట్ మధ్య అదనపు రక్షణ పొరగా పనిచేస్తుంది. హెల్మెట్ చెమటను పీల్చుకుంటుంది. ఇక మనం ధరించే హెల్మెట్ చెమట, ధూళి, నూనెను గ్రహిస్తుంది. అందుకే హెల్మెట్ లోపలి భాగాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. హెల్మెట్ లోపలి భాగం శుభ్రంగా ఉంటే చుండ్రు సమస్యలు దరిచేరవు. జుట్టు దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది.

Also Read:చలికాలంలో శరీరాన్ని కాపాడే మెంతి

#hair-care-tips #hair-care #health-tips #health-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe