Hai Nanna: త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటున్న *హాయ్‌ నాన్న* అమ్మడు!

మృణాల్‌ ఠాకూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపి అభిమానులను ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆమె నటించిన హాయ్‌ నాన్న విడుదల అవ్వడంతో న్యూజెర్సీలో అభిమానులతో ఆమె ఇంటరాక్ట్‌ అయ్యారు.

Hai Nanna: త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటున్న *హాయ్‌ నాన్న* అమ్మడు!
New Update

మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Takoor) అంటే అంత తొందరగా ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు...కానీ సీతారామం సీతా మహాలక్ష్మి అంటే మాత్రం ప్రతి ఒక్కరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. కెరీర్‌ మొదట్లో సీరియల్స్‌లో చెల్లిలి పాత్రలు చేసిన మృణాల్‌..సీతారామంతో ఒక్కసారిగా అభిమానుల్లో తనదైన చెరగని ముద్రని వేసుకుంది.

ఆచితూచి కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. మృణాల్‌ తో నటించేందుకు చాలా మంది హీరోలు ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సీతారామం తరువాత ఈ బ్యూటీ తాజాగా హాయ్‌ నాన్న అనే నాని చిత్రంలో నటించి మరింత పేరును తెచ్చుకుంది.

ప్రస్తుతం మృణాల్‌ చేతినిండా సినిమాలున్నాయని చెప్పుకొవచ్చు. సౌత్‌ నార్త్‌ అనే తేడా లేకుండా రెండు ఇండస్ట్రీల్లోనూ ముందుకు దూసుకు వెళ్తుంది మృణాల్‌. ప్రస్తుతం మృణాల్‌ ఓ సినిమా షూటింగ్‌ కోసం న్యూ జెర్సీలో ఉంది. ఈ క్రమంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె తాజాగా అభిమానులకు త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నాను అంటూ గుడ్‌ న్యూస్‌ చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచింది.

మృణాల్‌ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌ అనే సినిమాలో నటిస్తుంది. దాని షూటింగ్‌ కోసం న్యూ జెర్సీకి వెళ్లింది. అక్కడ హాయ్‌ నాన్న చిత్రం విడుదల కావడంతో న్యూ జెర్సీలోని ఓ థియేటర్‌ కి వెళ్లి తన అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఈ చిత్రంలో తన పాత్ర అందర్ని ఆకట్టుకుని ఉంటుందని ఆమె అభిప్రాయపడింది.

సినిమా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం నేను ఫ్యామిలీ స్టార్‌ అనే సినిమా షూటింగ్‌ కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిపింది. త్వరలోనే నాని కూడా న్యూ జెర్సీకి వస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆ తరువాత ఇద్దరం కలిసి మరోసారి అభిమానులతో ఇంటరాక్ట్‌ అవుతామని ఆమె వివరించింది. ఈ సమయంలోనే ఓ పిల్లాడు ఆమెని పెళ్లి ఎప్పుడూ అని ప్రశ్నించగా..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తెలిపింది.

నేను నా మొదటి సినిమా సీతారామం సినిమా సమయంలోనే న్యూజెర్సీకి వచ్చాను. మళ్లీ ఇప్పుడు హాయ్‌ నాన్న సినిమా సమయంలో కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె వివరించారు. హాయ్‌ నాన్న సినిమాలోని సమయమా, అమ్మాడి పాటలు అంటే తనకు ఎంతగానో ఇష్టమని వివరించింది.

Also read: నాని కూతురుగా చేసింది..ఆ ముద్దుగుమ్మనా..ఎంత షాక్‌ ఇచ్చారు బ్రో!

#cinema #mrunal-takoor #hai-nanna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe