Janasena: జనసేన అభిమానులకు హ్యాకర్స్ షాక్

జనసేనకు హ్యాకర్లు షాక్‌ ఇచ్చారు. పార్టీ అఫీషియల్‌ యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఛానల్‌ను రికవరీ చేసేందుకు జనసేన టెక్నికల్‌ టీమ్‌ ప్రయత్నిస్తోంది. సాంకేతిక నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నారు.

New Update
Janasena: జనసేన అభిమానులకు హ్యాకర్స్ షాక్

Janasena: జనసేనకు హ్యాకర్లు షాక్‌ ఇచ్చారు. పార్టీ అఫీషియల్‌ యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఛానల్‌ను రికవరీ చేసేందుకు జనసేన టెక్నికల్‌ టీమ్‌ ప్రయత్నిస్తోంది. సాంకేతిక నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నారు. జనసేన యూట్యూబ్‌ పేజ్‌ ఓపెన్‌ చేస్తే బ్యానర్‌లో గతంలో ఉన్న జనసేన సింబల్స్‌ అన్నీ పోయి ఆ స్థానంలో మైక్రోస్ట్రాటజీ అనే లోగో వస్తోంది. కింద ట్యాగ్‌లైన్‌ ఇంటెలిజెన్స్‌ ఎవ్రీ వేర్‌ అనే టెక్స్‌ కనిపిస్తోంది. ఈ ఛానల్‌లో పది లక్షల 40 వేల మంది సబ్‌స్ట్రైబర్లు కనిపిస్తున్నారు. హోమ్‌లో మాత్రం హ్యాకర్లకు సంబంధించిన వీడియోలు, బిట్‌కాయిన్‌, బిజినెస్‌ క్లాసుల వీడియోలు కనిపిస్తున్నాయి. వీడియో ట్యాబ్‌లో మాత్రం పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ఒక వీడియో కనిపిస్తోంది. ఇక లైవ్‌ ట్యాబ్‌లోకి వెళ్తే లైవ్‌ వీడియో లింకులు ఏమీ కనిపించడం లేదు. ఎలాంటి ప్లేలిస్ట్‌లు లేవు. కమ్యూనిటీ ట్యాబ్‌లో మాత్రం పవన్‌కు చెందిన కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే దీనిని త్వరలోనే రికవరీ చేస్తామని జనసేన సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఎప్పటి వరకు రికవరీ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులు మాత్రం కంగారుపడుతున్నారు.

ఇది కూడా చదవండి: పుచ్చిన దంతాలను రిపేర్‌ చేసే టెక్నిక్‌.. కొత్తవాటిలా మెరుస్తాయి

Advertisment
Advertisment
తాజా కథనాలు