H1B Visa : హెచ్-1 బీ దరఖాస్తులకు ఆఖరు తేదీ మార్చి 22

2025వ ఏడాది గానూ హెచ్‌-1బీ వీసాలను దరఖాస్తు చేసుకునేందుకు ప్రాథమిక గడువు ఈ నెల 22తో ముగియనుందని యూఎస్ సిటిజన్ షిప్‌ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ చెప్పింది. అప్లఐ చేసుకోవాలనుకునే అభ్యర్ధులు త్వరపడాలని సూచించింది.

USA Tourist Visa:యూఎస్ పర్యాటక వీసాదారులకు గుడ్‌న్యూస్..డ్రాప్ బాక్స్ సదుపాయం
New Update

H-1B Visa Application Last Date :  2025 ఏడాదికి సంబంధించి హెచ్-1 బీ వీసాలను అప్లై చేసుకునేవారికి అలెర్ట్ జారీ చేసింది యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్(US Citizenship & Immigration). వీసా దరఖాస్తుకు మరో రెండు రోజులుమాత్రమే గడువు ఉందని తెఇపింది. మార్చి 22తో రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతాయని హెచ్చరించింది. అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో యూఎస్‌సీఐఎస్(USCIS) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోని, ఫీజు చెల్లించాలని చెప్పింది. దాంతో పాటూ వీసా దరఖాస్తుకు అవసరమైన ఐ-907, ఐ-129 లాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా ఆన్‌ లైన్‌(Online) లో సమర్పించాలని సూచించింది.

ఇక హెచ్-1 బీ క్యాప్ పిటిషన్లకు అయితే ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది యూఎస్ కాన్సులేట్. వీటిని కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని తెలిపింది. దాంతో పాటూ నాన్ క్యాప్ అప్లికేషన్లు ఎప్పటినుంచి అందుబాటులో ఉంటాయో త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ప్రతి సంవత్సరం యూఎస్ 65,000 హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తుంది. దీనినే హెచ్ -1బీ క్యాప్ అంటారు. మరో 20,000 వీసాలను యూఎస్ లోని మాస్టర్ ఆఫ్ డిగ్రీ(Master Of Degree) పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు.

ఈ ఏడాది వీసా దరఖాస్తులో మార్పులు..

ఈ సంవత్సరం హెచ్ 1 బీ వీసా(H1 B Visa) దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు చేశారు.ఒకే వ్యక్తి తరఫున ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం వల్ల.. దుర్వినియోగమవుతోందని భావించిన యూఎస్సీఐఎస్ ఇందులో కొన్ని మార్పులను చేసింది. ఇకమీదట హెచ్ -1 బి వీసా దరఖాస్తులను వ్యక్తిగత దరఖాస్తుదారుల ఆధారంగా లెక్కించి స్వీకరించాలని నిర్ణయించింది. అంటే, ఒక ఉద్యోగి తరఫున వేర్వేరు సంస్థల నుంచి ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పటికీ.. అవన్నీ ఒకే దరఖాస్తు(Application) గా పరిగణించి, లాటరీ కి ఎంపిక చేస్తారు. దీనివల్ల హెచ్ 1 బీ ఎంపిక మరింత పారదర్శకంగా మారుతుందని, దరఖాస్తుదారులకు సమాన అవకాశాలు లభిస్తాయని యూఎస్‌సీఐఎస్ చెబుతోంది.

Also Read : Direct Tax Collection: ప్రభుత్వానికి డబ్బే డబ్బు.. పెరిగిన డైరెక్ట్ టాక్స్ వసూళ్లు.. ఆ లెక్కలివే!

#usa #h1-b-visa #appilication
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe