Rahul Singh: ఆస్తి వివాదాలతోనే రాహుల్ సింగ్ హత్య రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని జిమ్ ట్రైనర్ రాహుసింగ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాహుల్ సింగ్ హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. By Vijaya Nimma 03 Sep 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి భాగ్యనగర్‌లో జిమ్ ట్రైనర్ రాహుల్‌సింగ్ హత్య కేసును పోలీసులు చేధించారు. కేసుకు సంబంధించిన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆరు మంది సుఫారీ గ్యాంగ్‌తో పథకం ప్రకారం హత్య చేయించాడు దుండగులు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, మీడియాకు వెల్లడించారు. హైదర్‌గూడ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ రాహుల్ సింగ్ హత్య చేసింది టోలీచౌకి సుఫారీ అని పోలీసులు తేల్చి చెప్పారు. మృతుడు బలరాం రాహుల్ సింగ్ (25) గండిపేట్ మండలం మణికొండ ఫ్రెండ్స్ కాలనీకి చెందినవారని తెలిపారు. ఈ హత్య కేసులో మృతునికి సమీప బంధువులైన ఏవన్ వినోద్ సింగ్, ఏ టూ రాజాసింగ్ అలియాస్ గోపిసింగ్‌తో ఆస్తి వివాదాలు ఉన్నాయని మీడియాకు సమావేశంలో వెల్లడించారు. ఈ వివాదాల కారణంగా ఒకరిపై ఒకరు పలుమార్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేసుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా మణికొండ గ్రామంలోని సర్వే నెంబర్ 96 నుండి 103 వరకు ఉన్న భూమిలో రాహుల్‌సింగ్‌తో ఆస్తి వివాదం నెలకొంది. ఆస్తి భాగాలలో ప్రధాన నిందితులకు మృతుడు రాహుల్ సింగ్ వాటాను ఇవ్వడానికి నిరాకరించాడు. అంతేకాకుండా రెండు డూప్లెక్స్ హౌస్‌ల విక్రయాలలో కూడా పూర్తి వాటాలను దక్కించుకోవాలని నిందితులు భావించారని పోలీసులు తెలిపారు. Your browser does not support the video tag. ఎలాగైనా ఆస్తి వాటాలను దక్కించుకోవాలని వినోద్ సింగ్, రాజాసింగ్ అలియాస్ గోపి సింగ్ కలసి రాహుల్ సింగ్ హత్యకు పథకం పన్నారు. ఈ హత్యకు గాను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అక్బర్‌కు రూ.15 లక్షల సుఫారీ చెల్లించడానికి నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నారు. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఒప్పందం కుదుర్చుకున్న అక్బర్ మిగతా నిందితులు సయ్యద్ సెహబాజ్, సయ్యద్ ఇర్ఫాన్, మెహబూబ్, మాజీద్, అప్పర్ పాషాతో కలిసి ఈనెల 29న హైదర్‌గూడ సెలబ్రిటీ జిమ్‌లో రాహుల్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుండి పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 1 లక్షా 25 వేల రూపాయాల నగదుతో పాటు.. హత్యకు ఉపయోగించిన టాయోటా కాలిస్ వాహనం, స్కూటీ, నిందితుల మొబైల్ ఫోన్లు, హత్యకు ఉపయో గించిన పెప్పర్ స్ప్రేను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి రాజేంద్రనగర్ పోలీసులు తరలించారు. Your browser does not support the video tag. #rajendranagar #gym-trainer-rahul-singh #supari-murder #attapur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి