Telangana Elections: నన్ను చంపేందుకే దాడి చేశారు.. గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు

తనపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. కాంగ్రెస్ నేత వంశీకృష్ణ అతని అనుచరులతో ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో కూడా వంశీకృష్ణ ఇలానే దాడి చేయించారని అన్నారు. రాజకీయాల్లో పగలు, ప్రతీకారాలు మన సంస్కృతి కాదు అని తెలిపారు.

New Update
Telangana Elections: నన్ను చంపేందుకే దాడి చేశారు.. గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు

Fight Between Congress, BJP Leaders: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేతలు దాడులు చేసుకునే దాకా తీసుకువచ్చాయి. నిన్న( శనివారం) రాత్రి అచ్చంపేటలో(Achampet) బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య జరిగిన దాడే ఇందుకు నిదర్శనం. ఎన్నికల ప్రచారం ముగుంచుకుని వెళ్తుంటే తమను కాంగ్రెస్ నేత వంశీ కృష్ణ (Vamshi Krishna) కార్యకర్తలు అడ్డుకొని తమపై రాళ్ల దాడి చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నారు. మరోవైపు ప్రచారం అనే ముసుగులో అచ్చంపేట ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) తనవెంట ఐదు వాహనాల్లో ప్రజలకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ దాడిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇవాళ డిశ్చార్జి అయ్యారు. అపోలో ఆసుపత్రిలో ఉన్న గువ్వల బాలరాజును ఇవాళ ఉదయం మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావులు (Harish Rao) పరామర్శించారు. గువ్వల బాలరాజుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.

ALSO READ: బిగ్ బాస్ ఫేమ్, నటి అరెస్ట్.. ఎందుకంటే?

అపోలో ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జి అయిన గువ్వల బాలరాజు మాట్లాడుతూ.." శనివారం రాత్రి తన కారును కొందరు అడ్డుకొని తనపై దాడి చేశారని అన్నారు. ప్రజల ఆశీస్సులతో ప్రాణాలతో బతికి బయటపడ్డా అని తెలిపారు. తన అనుచరులపై కూడా దాడిచేశారని పేర్కొన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు సరికాదని అన్నారు. తనపై గతంలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ దాడులు చేయించారని తెలిపారు. నిన్న రాత్రి కూడా వంశీకృష్ణ స్వయంగా దాడులు చేయించారని ఆరోపించారు. ప్రాణం ఉన్నంతవరకు ప్రజల కోసం పోరాడుతానని తెలిపారు.

ALSO READ: కాంగ్రెస్ లోకి విజయశాంతి.. క్లారిటీ!

Advertisment
తాజా కథనాలు