Nagarjuna Sagar Dam: దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం దుశ్చర్య.. గుత్తా సంచలన వ్యాఖ్యలు..

నాగార్జున సాగర్‌ డ్యామ్ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. డ్యామ్‌ పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వచ్చారని మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు.

New Update
Nagarjuna Sagar Dam: దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం దుశ్చర్య.. గుత్తా సంచలన వ్యాఖ్యలు..

నాగార్జునసాగర్ డ్యామ్‌ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే దీనిపై తాజాగా శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ.. సాగర్ డ్యామ్‌ పైకి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు దౌర్జన్యంగా వచ్చారని మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. అలాగే మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాబోతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: ఈసారి చలికాలం ఎలా ఉంటుందో తెలుసా..?

ఇదిలాఉండగా.. కృష్ణా నీటి పంపిణీ విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి శనివారం రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం అవుతారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం డ్యాం, రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలు, వాటి పరిధిలో ఉన్న ఇతర నిర్మాణాలన్నింటినీ కృష్ణా బోర్డుకు బదిలీచేసే అంశాలపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ వద్ద నెలకొన్న వివాదం ఈ సమావేశంతో కొలిక్కి వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇదిలాఉండగా.. ఉమ్మడి ప్రాజెక్టులో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్‌ను నియంత్రంచడంలో మీ వైఫల్యంవల్లే.. మా భూభాగంలోని నాగార్జునసాగర్‌ స్పిల్‌వేలో సగం, కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను గురువారం స్వాధీనం చేసుకున్నామని ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖలో పేర్కొన్నారు.

Also Read: కేంద్ర బలగాల అధీనంలోకి నాగార్జునసాగర్.. ఈరోజు వివాదం కొలిక్కి వస్తుందా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు