GUNTUR KAARAM SUCCESS MEET EVENT: సూపర్ స్టార్ మహేష్ బాబు(MAHESH BABU)గుంటూరు కారం మూవీ మ్యానియా మాములుగా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 12న రిలిజవ్వబోతోన్న ఈ మూవీ ప్రిలిలిజ్ ఈవెంట్ గుంటూరులో చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేదికపైన మహేష్ బాబు మాట్లాడిన మాటలు అభిమానుల గుండెల్లో చొచ్చుకుపోయాయి.ఇక నుంచి అమ్మ,నాన్న అన్నీ మీరే అని అభిమానులను ఉద్దేశించి మహేష్ మాట్లాడిన మాటలు ఫ్యాన్సే మనసులపై చెరగని ముద్ర వేసాయి. అయితే .. ఈ వేడుక అంత విజయవంతం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ లో గుంటూరు కారం సినిమా సక్సస్ మీట్ లో ఎక్కడ అనేది చూచాయగా చెప్పకనే చెప్పారు మహేష్. ఇప్పుడు ఈ పోస్ట్ నేట్టింట వైరల్ గా మారింది.
పూర్తిగా చదవండి..ఫుల్ కాన్ఫిడెంట్ తో మూవీ టీం
గుంటూరు కారం మూవీ నుంచి ఇప్పటికే రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ కు అల్టిమేట్ రెస్పాన్స్ వస్తూ ఉండటంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన పాటలు ఇచ్చి పడేసాయి. పాటలకు స్క్రీన్స్ ధద్దరిల్లిపోవడం ఖాయం అంటూ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న దిల్ రాజు సైతం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. రీసెంట్ గా రిలీజయిన ట్రైలర్ కు, మావా సాంగ్ కు భారీ స్పంధన రావడంతో ఈ సంక్రాంతికి అసలు సిసలు హిట్ అని బలంగా నమ్ముతున్నారు.
సక్సెస్ మీట్ లోనే మాట్లాడుతా
ప్రి రిలీజ్ వేడుకలో తమన్ తాను ఇప్పుడేం మాట్లాడను సక్సెస్ మీట్ లోనే మాట్లాడుతానని చేపడంతో గుంటూరు కారం ఘాటు కు థియేటర్స్ ధద్దర్లడం ఖాయం అని ..మహేష్ బాబు అంత కాన్ఫిడెంట్గా మహేష్ బాబు ఇన్ డైరెక్ట్ గా సక్సస్ మీట్ వేదిక చెప్పకనే చెప్పాడంటూ ఇప్పుడ సోషల్ మీడియాల్లో ఫాన్స్ హ్యాష్ టాగ్ గుంటూరు కారం పేరును ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు కు జోడీగా శ్రీలీల నటిస్తుండగా , మీనాక్షి చౌదరి గస్ట్ అప్పిరియన్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ పంచులతో మాస్ ను అలరించే అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా రికార్డులు మదతపెట్టేందుకు వస్తోంది గుంటూరు కారం.
Thank you, Guntur!! ♥️
Celebrating the film in my hometown surrounded by so much love, is a timeless memory that I will hold close to my heart. Love you all, my superfans and I look forward to seeing you again…very soon!! ♥️♥️♥️ Sankranthi begins now!! 🎉 #GunturKaaram— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2024
ALSO READ:ఏపీలో “గుంటూరు కారం” చిత్రానికి పెంచిన టికెట్ ధరల వివరాలివే!
[vuukle]