Guntur Kaaram pre release event: గుంటూరు కారం ప్రి రిలిజ్ వాయిదా పడింది ..కొత్త డేట్ ఎప్పుడంటే.!!

మహేష్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన గుంటూరు కారం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ జనవరి 6న జరగాల్సి ఉంది.పర్మిషన్స్ లభించకపోవడంతో ఈవెంట్ పోస్ట్ పోన్ చేశారు.కొత్త డేట్ ను త్వరలో ప్రకటిస్తామని ఎక్స్ ద్వారా తెలియజేసారు.

Guntur Kaaram pre release event: గుంటూరు కారం ప్రి రిలిజ్ వాయిదా పడింది ..కొత్త డేట్ ఎప్పుడంటే.!!
New Update

Guntur Kaaram pre release event:సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఈ క్రమంలో ఈ చిత్ర ప్రి రిలిజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జనవరి 6 న నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు.ఈ ఈవెంట్ వేదికగా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించింది.ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఇలాంటి టైంలో ఈవెంట్ వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించేసరికి ఫ్యాన్స్ ఒక్కసారి షాక్ అయ్యారు.ఈ మేరకు మేరకు అఫిషియల్ అనౌన్స్మెంట్ ఎక్స్ ద్వారా ఇచ్చారు.

పర్మిషన్ రాలేదు. సెక్యూరిటీ సమస్యలతో పోస్ట్ పోన్ 

ప్రభుత్వం నుంచి, పోలీస్ శాఖ నుంచి పర్మిషన్ లభించకపోవడంతో సెక్యూరిటీ సమస్యల ఎదురవుతాయని, ఈ ఈవెంట్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు గుంటూరు కారం టీమ్ ఎక్స్ ద్వారా అనౌన్స్ చేసింది.

ఫ్యాన్స్ కు క్షమాపణలు

ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 6 న ఈవెంట్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నించామని, కానీ అనివార్య కారణాల వల్ల ఈవెంట్ చేయలేకపోతున్నందుకు ఫ్యాన్స్ కు క్షమాపణలు కోరుతున్నామని అంటూ ..త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ న్యూ డేట్ అనౌన్స్ చేస్తామని గుంటూరు కారం టీమ్ తెలిపింది.

ALSO READ:Siddu Jonnalagadda Tillu Square:టిల్లు స్క్వేర్ ను ఎగరేసుకుపోయిన ఈగల్

భారీ బజ్

ఇప్పటికే గుంటూరు కారం బజ్ బారీ స్తాయిలో ఏర్పడటంతో సినిమాకు అత్యధిక సంఖ్యలో థియేటర్స్ కేటాయిస్తున్నట్లు దిల్ రాజు చెప్పడం కూడా జగిగింది. సో..హిట్ వైబ్రేషన్స్ పుష్కలంగా ఉన్న ఈ గుంటూరు కారంలో ఘాటైన సీన్స్ ఉండపోతున్నాయని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది.మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరీ జంటగా నటిస్తోన్న ఈ మూవీకి థమన్ స్వరాలు దుమ్మురేపుతున్నాయి.

ALSO READ:HANU- MAN RELEASE: హను- మాన్ రిలీజ్ అవుతుందా ? పోస్ట్ పోన్ అవుతుందా ?

#trivikarm #guntur-kaaram-pre-release-event #srileela #meenakshi-chaudhary #mahesh-babu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe