Moscow Attack : ఆ యాప్‌ నుంచే మాస్కో దాడికి కుట్ర

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులు మేసిజింగ్‌ యాప్‌ అయిన టెలిగ్రామ్‌ నుంచే ఈ కుట్రను నడిపించారు. రష్యా చిక్కిన నిందితుల్లో ఒకరు ఈ విషయాన్ని చెప్పాడు. డబ్బుల కోసమే ప్రజలపై కాల్పులు జరిపానని చెప్పాడు.

Moscow Attack : ఆ యాప్‌ నుంచే మాస్కో దాడికి కుట్ర
New Update

App : రష్యా(Russia) రాజధాని మాస్కో(Moscow) లో జరిగిన ఉగ్రదాడి(Terrorist Attack) సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ భీకర దాడిలో 150 మంది పౌరులు మృతి చెందారు. ఇప్పటికే రష్యా అధికారులు 11 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకోగా.. అందులో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. అయితే ఉగ్రదాడికి సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. క్రాకస్‌ సిటీ కాన్సర్‌ హాలులో దాడికి పాల్పడ్డ ముష్కరులు.. మెసేజింగ్ యాప్‌ అయిన టెలిగ్రామ్‌ నుంచే ఈ కుట్రను నడిపించినట్లు తెలుస్తోంది.

Also Read : ఈ ఊర్లో అందరూ కుంభకర్ణులే..పడుకుంటే నెల రోజులు లేవరు!

నిందితులది తజికిస్థాన్‌ !

రష్యా అదుపులో ఉన్న నిందితులు తమకు డబ్బులు, ఆయుధాలు ఎవరిచ్చారో తెలియదని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పలు టీవీ ఛానెళ్లలో కూడా వచ్చాయి. నలుగురు నిందితులు, వాళ్లు వాడిని కారును చూపించాయి. వీళ్లని బ్రియన్స్క్‌ పశ్చిమ ప్రాంతంలో ఖట్సన్ అనే గ్రామం వద్ద రష్యా దళాలు అరెస్టు చేశాయి. రాత్రి వేళ రికార్డ్ చేసిన దృశ్యాల్లో ఒక వ్యక్తిని ప్రశ్నిస్తుండగా.. అతడు రష్యా భాషలో మాట్లాడుతున్నాడు. అయితే వీళ్లందరూ తజికిస్థాన్‌కు చెందిన వారని రష్యా ఎంపీ ఒకరు తెలిపారు.

డబ్బుల కోసమే చేశా

కింద కూర్చోని ఉన్న ఓ నిందితుడు మాట్లాడుతూ డబ్బుల కోసమే ప్రజలపై కాల్పులు జరిపినట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. కొందరు 5 లక్షల రూబుళ్లను ఆఫర్ చేసినట్లు చెప్పాడు. తమను సంప్రదించి డీల్‌ కుదుర్చుకొని.. డబ్బు, ఆయుధాలు అందజేసిన వారు ఎవరో తెలియదని తెలిపాడు. వారి పేర్లు కూడా చెప్పలేదని.. కేవలం టెలిగ్రామ్ యాప్ నుంచే సంప్రదించినట్లు పేర్కొన్నాడు. అలాగే దాడి చేసిన తర్వాత ఆయుధాలను రోడ్డు పక్కన పారేసినట్లు మరో దుండగుడు చెప్పాడు.

నిందితులపై రష్యా దళాలు దాడి చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా.. మాస్కోలో జరిగిన భీకర ఉగ్రదాడిలో ఇప్పటివరకు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడి తామే చేశామని ఇస్లామిక్ స్టేక్ ప్రకటించింది. తాము మిషిన్‌గన్‌, బాంబులు, కత్తులతో ఈ దాడులు చేశామని తెలిపింది. మరోవైపు ఈ దాడికి స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. దీనికి కారకులైన వారని విడిచిపెట్టేది లేదని హెచ్చరించాడు. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు ఉక్రెయిన్‌(Ukraine) తో సంబంధాలున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. మరోవైపు ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ వాదిస్తోంది.

Also Read : పంది కిడ్నీనీ మనిషికి అమర్చిన అమెరికన్ వైద్యులు!

#terrorist-attack #telugu-news #russia-terror-attack #moscow-terror-attack
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe