Gummanur Jayaram: ఆ నియోజకవర్గం నుండే గుమ్మనూరు జయరాం పోటీ..!
మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు, మద్ధతుదారులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆలూరు నియోజకర్గానికి చెందిన దాదాపు 100 మంది ముఖ్యనాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుంతకల్ నియోజకవర్గంను గుమ్మనూరు జయరాంకు కేటాయించినట్లు తెలుస్తోంది.
Gummanur Jayaram: మంగళగిరి జయహో బీసీ సభ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన అనుచరులు, మద్ధతుదారులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆలూరు నియోజకర్గానికి చెందిన దాదాపు 100 మంది ముఖ్యనాయకులకు చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం కావాలని తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. చంద్రబాబు - పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో మంచి విజయం సాధిస్తారన్నారు. గుంతకల్ నియోజకవర్గంను అధిష్టానం తనకు కేటాయించినట్లు తెలిపారు. కర్నూలు, అనంతపురం రెండు జిల్లాల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఎమ్మెల్యే అవుతానని జోస్యం చెప్పారు. తనకు ఏ పని అప్పజేప్పినా మనస్పూర్తిగా పని చేస్తానని వ్యాఖ్యానించారు.
తాను పెరిగిన ఆలూరుకి అప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశానని వెల్లడించారు. పుట్టిన గుంతకల్లు నియోజకవర్గానికి సేవలు అందించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను రాజీనామా చేసిన తర్వాత బర్తరఫ్ చేసినా పట్టించుకోనని పేర్కొన్నారు. ఆశావహలు టిక్కెట్ రావడంలేదని కొంచెం వ్యతిరేకంగా ఉండవచ్చు అలాంటి వారిని పిలిచి మాట్లాడుకుంటానని తెలిపారు.

Also Read: ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?
ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం కావాలని తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. చంద్రబాబు - పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో మంచి విజయం సాధిస్తారన్నారు. గుంతకల్ నియోజకవర్గంను అధిష్టానం తనకు కేటాయించినట్లు తెలిపారు. కర్నూలు, అనంతపురం రెండు జిల్లాల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఎమ్మెల్యే అవుతానని జోస్యం చెప్పారు. తనకు ఏ పని అప్పజేప్పినా మనస్పూర్తిగా పని చేస్తానని వ్యాఖ్యానించారు.
Also Read: ఎంపీ పదవి కోసమే పురందేశ్వరి ఆరాటం: కొడాలి నాని