Shami: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్‌కు షమీ దూరం.. ఎందుకంటే? ఐపీఎల్ ప్రారంభానికి నెల రోజుల ముందే గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. అతని గాయానికి శస్త్రచికిత్స అవసరమని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత షమీ గ్రౌండ్‌లోకి దిగలేదు. By Trinath 22 Feb 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL 2024: ఎడమ చీలమండ గాయం కారణంగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ వచ్చే నెల నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు దూరం కానున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో 33 ఏళ్ల ఆడడంలేదు. అతను చివరిగా నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జనవరి చివరి వారంలో చీలమండ గాయానికి సంబంధించి స్పెషల్ ఇంజెక్షన్లు తీసుకున్నాడు. ప్రస్తుతం షమీ లండన్‌లో ఉన్నాడు. అతని గాయానికి శస్త్రచితిక్స అవసరమని సమాచారం. ఎందుకంటే షమీకి ఇచ్చిన ఇంజెక్షన్లు అతని గాయాన్ని నయం చేయలేదు.. అందుకే శస్త్రచికిత్స మాత్రమే మిగిలి ఉంది. ఇది గుజరాత్ టైటాన్స్‌కు గట్టి దెబ్బగానే చెప్పవచ్చు. ఇంకా మదిలోనే షమీ ఆట: హార్దిక్ పాండ్య గాయంతో ప్రపంచకప్ కు దూరమవడంతో గ్రౌండ్ లో దిగిన షమీ మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించి 24 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనతో వరల్డ్‌కప్‌లోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన షమీ ఫైఫర్లతో అదరగొట్టాడు. ఫైఫర్లు(ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు) తియ్యడం ఇంత ఈజీనా అన్నట్లు సాగింది షమీ ప్రదర్శన. సెమీస్‌లో ఏకంగా 7వికెట్లు తీసి ఔరా అనిపించాడు. బౌలింగ్ పిచ్‌లపై షమీ రాణించిన తీరు అందరిని కట్టిపడేసింది. గుజరాత్‌కు గట్టి దెబ్బే: 2023 ఐపీఎల్ ఎడిషన్‌లో టైటాన్స్ తరుఫున 28 వికెట్లు పడగొట్టిన తీశాడు షమీ. 2022 ఐపీఎల్ ఎడిషన్‌లో 20 వికెట్లు తీశాడు. ఇటీవలే అర్జున అవార్డు అందుకున్న షమీ తన దశాబ్దపు కెరీర్‌లో 229 టెస్టు, 195 వన్డే, 24 టీ20 వికెట్లు పడగొట్టాడు. ఇక వచ్చే నెలలో మొదలుకానున్న ఐపీఎల్‌లో షమీ ఆడే ఛాన్స్ లేకపోవడంతో గుజరాత్ టైటాన్స్ అతని రిప్లేస్‌మెంట్ కోసం ఆలోచిస్తోంది. అయితే ఇప్పటివరకు షమీ విషయం గురించి జీటీ మ్యానేజ్‌మెంట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. డిసెంబర్‌లో జరిగిన IPL వేలం సమయంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా నుంచి షమీని రిప్లేస్ చేసుకోవచ్చు. Also Read: వైరల్ అవుతున్న విరాట్ కొడుకు అకాయ్ ఏఐ ఫోటోలు #ipl #mohammed-shami #ipl-2024 #gujarat-titans మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి