Guava Leaf Chutney: జామాకుల చట్నీ ఎలా చేస్తారు..? ఉపయోగాలు ఏంటి..? జామ ఆకుల టీ, చట్నీ తో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. జామాకుల్లో ఆరోగ్య విలువలు చర్మ నాణ్యతను, చర్మ రోగాలను నివారిస్తుంది. మహిళలకు రుతు సమయంలో కడుపు నొప్పి తగ్గాలంటే జామఆకులు బాగా పని చేస్తాయి. By Vijaya Nimma 17 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Guava Leaf Chutney: చట్నీలో రకరకాల చట్నీలు ఉంటాయని తెలుసు. కానీ జామ ఆకులతో చట్నీ ఎప్పుడైనా చేశారా..? దీనికి ఒక రూపాయి ఖర్చు లేకుండా సులువుగా తాయరు చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో జామ చెట్టు ఉంటుంది. జామ ఆకుల టీ, చట్ని చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. అంతేకాకుండా టిఫిన్‌లోకి, అన్నంలోకి ఈ చట్నీ తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జామపండుకు పేదవాడి యాపిల్ పండుగా పేరు ఉంది. ప్రకృతి వైద్యంలో జామ పండ్లతో పాటు చెట్లకు సంబంధించిన ప్రతిదీ వాడుతారు. జామ ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి వాపులు, నొప్పులు తగ్గించేందుకు అద్భుతంగా పని చేస్తాయి. అయితే.. జామ ఆకులతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. జామాకు చట్నీ తయారీ ముందుగా లేతగా ఉన్న జామ ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత వాటిని మిక్సీలో పేస్టుగా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో సరిపడా కారం, ఉప్పు వేసుకొని పేస్టుగా చేసుకోవాలి. అనంతరం దీనిని పప్పు తాలింపు వేసుకున్నట్టుగా వేసుకోవాలి. ఈ చట్నీ కొద్దిగా వగరుగా ఉంది కాబట్టి మిక్సీ పట్టే సమయంలో కొంత చింతపండు, బెల్లం వేసుకోచ్చు. ఎవరి రుచికితగ్గట్టు వారు వాటిని వాడుకోవచ్చు. అంతేకాదు.. జామాకుల్లో కూడా ఆరోగ్య విలువులు పుష్కలంగా ఉంటాయి. ఇవి.. చర్మ నాణ్యతను మెరుగు చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాదు చర్మ రోగాలను నివారిస్తుంది. ఇది కూడా చదవండి: యాలకులు నీటిలో నానబెట్టి తింటే అంతులేని లాభాలు మహిళలకు రుతు సమయంలో కడుపు నొప్పి తగ్గాలంటే జామాకులు బాగా పని చేస్తాయి. ఈ ఆకుల్లో విటమిన్-సి జీర్ణక్రియ, మలబద్ధకం, ఆకలి, ఇతర వ్యాధులు రాకుండా కాపాడుతుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉండాలంటే జామాకుల చట్నీ, జామాకుల టీ బెస్ట్. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ -సి, పొటాషియం, ఫైబర్ ఎక్కువ. చలికాలంలో వచ్చే జలుబు జామాకులు టీ తగ్గిస్తుంది. జామాకుల టీ తాగితే బ్లడ్ షుగర్ గంట వరకు అదుపులో ఉంటుంది. జామాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. గుండెను కాపాడుతోంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచెందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #guava-leaf-chutney #guava-leaf-tea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి