ISRO: రేపు జీఎస్ఎల్వీ ఎఫ్-14 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి రెడీ అయింది. రేపు షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 14 రాకెట్‌ను నింగిలోకి పంపించనుంది. రేపు సాయంత్రం పంపించే రాకెట్‌కు ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి కౌంట్ డౌన్ స్టార్ చేశారు.

New Update
ISRO: రేపు జీఎస్ఎల్వీ ఎఫ్-14 ప్రయోగం

GSLV F-14 Rocket : ఇస్రో(ISRO) షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14(GSLV F-14) రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీని కోసం ఇవాళ మధ్యాహ్నం 2.05 గంటల నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. రాకెట్ ప్రయోగానికి మొత్తం 27.30 గంటల కౌంట్‌డౌన్‌ చేయనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీని తర్వాత జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ నింగిలోకి ప్రయాణించనుంది. ఈ రాకెట్‌లో 2,272 కిలోల బరువు కలిగిన ఇన్‌శాట్‌-3 డీఎస్‌(INSAT-3 DS) ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

Also Read : Cricket : 500 వికెట్ల క్లబ్‌లో ఆర్. అశ్విన్

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం షార్‌ కేంద్రం నుంచి ఇది 92వ ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వది. ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఉపగ్రహం ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనది. ఇక్కడే క్రయోజనిక్‌ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10 వ ప్రయోగం జీఎస్ఎల్వీ ఎఫ్-14 అని తెలిపారు ఇస్రో శాస్త్రవేత్తలు.

రేపు సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరికోట(Srihari Kota) నుంచి GSLV-F14/INSAT 3DS మిషన్ ను ఇస్రో అంతరిక్షంలోకి పంపుతోంది. ఈ వ్యోమనౌక వాతావరణ శాటిలైట్ INSAT-3DS ని జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. GSLV మూడు దశల ప్రయోగించబడుతుంది. 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుంది. ఇది ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్ ఉపయోగించి క్రయోజెనిక్ దశతో ఘన, ద్రవ చోదక దశలను కలిగి ఉంటుంది.

Also Read : Nellore : నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం

Advertisment
Advertisment
తాజా కథనాలు