హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం నెలకొంది. 70 ఏళ్ల ఖైరతాబాద్ మహా గణేష్ చరిత్రలో ఉత్సవాలపై తొలిసారిగా అభిప్రాయభేదాలు వచ్చాయి. ఇంకా విగ్రహ తయారీ పనులు ముందుకు సాగడం లేదు. ప్రతి ఏడాది వందరోజుల ముందు నుంచే విగ్రహాన్ని తయారుచేసే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి మాత్రం ఆలస్యం జరుగుతోంది. రెండు వర్గాలుగా ఉత్సవ కమిటీ విడిపోయింది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ , శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ మధ్య భేదాభిప్రాయలు వచ్చాయి. తామే ఉత్సవాలు నిర్వహిస్తాం అని పోటాపోటీగా ప్రకటిస్తున్నారు.
Also Read: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
రెండు వర్గాల కమిటీ అధ్యక్షుడుగా ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు కమిటీలతో కలిసి ఆయన భేటీ అయ్యారు. దానం ఎంట్రీతో రెండు కమిటీల మధ్య రాజీ కుదిరింది. 100 మందితో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా దానం నాగేందర్, చైర్మన్‌గా రాజ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు.
Also Read: దారుణం.. క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి