Green Apple: గ్రీన్‌ యాపిల్‌తో గుండె జబ్బులు పరార్‌

ప్రకృతి మనకు ప్రసాదించిన వాటిలో పండ్లు ముఖమైనవి. పండ్లు ఎక్కువగా తింటే రోగ నిరోధకశక్తి పెరగడంతో పాటు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. రక్తాన్ని శుద్ధి చేసి హెల్దీగా ఉండేలా చేస్తాయి.

New Update
Green Apple: గ్రీన్‌ యాపిల్‌తో గుండె జబ్బులు పరార్‌

Green Apple Health Benefits: యాపిల్‌ గురించి మనందరికీ తెలుసు. రోజుకో యాపిల్‌ తింటే డాక్టర్‌ అవసరం ఉండదని నిపుణులు అంటుంటారు. ఎన్నో పోషక విలువలు ఈ యాపిల్‌ పండ్లలో ఉన్నాయి. యాపిల్‌లో మరోరకమే గ్రీన్‌ యాపిల్‌. ఈ గ్రీన్‌ యాపిల్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది, దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా గ్రీన్‌ యాపిల్‌ తినడం వల్ల మలబద్ధకం ఉండదు. వీటిలో ఉండే డైటరీ ఫైబర్‌ మన పేగులను శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా పీచు పదార్థం ప్రీబయోటిక్‌లా ఉపయోగపడుతుంది. మన కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీని ద్వారా మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్రీన్‌ యాపిల్స్‌ షుగర్‌ లెవల్స్‌ని కూడా బాగా కంట్రోల్‌ చేస్తాయి. టైప్‌ 2 మధుమేహం రాకుండా చూస్తాయి. ప్రతి రోజు ఒక గ్రీన్‌ యాపిల్‌ తింటే వ్యాధులు మన దరి చేరవు.

ఇది కూడా చదవండి: 30 ఏళ్ళు వచ్చాక పెళ్ళి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా?

నిత్యం వీటిని తినడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం మీ సొంతం అవుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ గ్రీన్‌ యాపిల్స్‌లో పెక్టిన్‌ అనే మిశ్రమం ఉండటం వల్ల మన పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సంవృద్ధిగా ఉంటాయి. ఇవి పలు రకాల ఇన్‌ఫెక్షన్లతో పోరాటం చేస్తాయి. యాపిల్‌లో ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాల్స్‌తో పాటు విటమిన్‌ సి కూడా అత్యధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు మన బాడీలో ఆక్సీకరణ ఒత్తిడిని తక్కువ చేసి రోగ నిరోధకశక్తిని బాగా పెంచుతాయి. సాధారణంగా ఈ గ్రీన్‌ యాపిల్స్‌ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (GI)ని అత్యధికంగా కలిగివుంటాయి. జీఐ అంటే మన రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ఎంత త్వరగా పెరుగుతాయనేది తెలుపుతుంది. తక్కువశాతం జీఐ ఉండే ఆహార పదార్థాలు తొందరగా జీర్ణం అవుతాయని నిపుణులు అంటున్నారు.

గ్రీన్‌ యాపిల్‌లో పీచు పదార్థం ఎక్కువ

అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల నుంచి మనల్ని కాపాడుతాయి. ఇందులోని ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా బాగా తగ్గిస్తుంది. దాంతో గుండె జబ్బులు మన దరి చేరవు. అలాగే రక్తనాళాలు, ధమనులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తాయి. గ్రీన్‌ యాపిల్‌ మన మెదడులోని కణాలను డ్యామేజ్‌ కాకుండా రక్షిస్తుంది. జ్ఞాపకశక్తి, చిత్తవైకల్యం ప్రమాదాన్ని నివారిస్తుంది. గ్రీన్‌ యాపిల్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మనం ఏదైనా కొంచెం తిన్నా ఎక్కువగా తిన్నట్టు అనిపిస్తుంది. దీంతో బరువు కూడా తగ్గుతారని నిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు