ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని మనవడి హత్య! కొడుకు కోడలు విడిపోతే..ఆస్తి కొడుకుకి కాకుండా మనవడికి ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఓ తాత సొంత మనవడినే హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో చోటు చేసుకుంది. By Bhavana 12 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి కొడుకు కోడలు విడిపోతే..ఆస్తి కొడుకుకి కాకుండా మనవడికి ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఓ తాత సొంత మనవడినే హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో చోటు చేసుకుంది. ఆగస్టు 9న కనిపించకుండా పోయిన వెంకట కళ్యాణ్ అనే బాలుడు ఓ డ్రెయిన్ లో శవంగా కనిపించాడు. మీనవల్లూరుకు చెందిన పోకల వెంకట కల్యాణ్ బుధవారం ఉదయంనుంచి కనిపించడం లేదని బాలుడి తల్లి అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గణపవరం మండలం కోమర్రులోని ముత్యాలమ్మ తల్లి గుడికి సమీపంలో యనమదుర్రు డ్రెయిన్ లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఎక్కడ ఆస్తి మనవడికి ఇవ్వాల్సి వస్తుందోననే ఉద్దేశంతోనే తాతే బాలుడిని హత్య చేసినట్లు బాలుడి తల్లి శిరీష ఆరోపిస్తున్నారు. మీనవల్లూరు గ్రామానికి చెందిన పోకల నాగేశ్వరరావు కుమారుడు సత్యనారాయణకు పది సంవత్సరాల క్రితం ఏలూరు జిల్లా బుట్టాయగూడెం రామన్నగూడెనికి చెందిన శిరీషతో వివాహం జరిగింది. సత్యనారాయణ శిరీషలకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు కల్యాణ్ అత్తిలిలో ఓ ప్రైవేట్ స్కూల్ లో ఎల్ కేజీ చదువుతున్నాడు. కొంత కాలం నుంచి శిరీషకు ఆమె భర్తకు విభేదాలు వచ్చాయి. పెద్ద మనుషులు రాజీ కుదిర్చినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో శిరీష సత్యనారాయణతో విడిపోతే తన ఆస్తి మొత్తం మనవడికి ఇవ్వాల్సి వస్తుందని నాగేశ్వరరావులో అనుమానాలు మొదలయ్యాయి. దాంతో ఈ నెల 9న స్కూల్ కి వెళ్తున్న మనవడిని బండి మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్లి దారి మధ్యలోనే హత్య చేసి యనమదుర్రు డ్రెయిన్ లో పడేసినట్లు శిరీష పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. నాగేశ్వరరావు కుమారుడు సత్యనారాయణ పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. #west-godavari #murder #crime #garnd-father #grandson మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి