Vinayaka Nimajjanam: అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం(Amalapuram)లో వినాయక నిమజ్జనం(Vinayaka Nimajjanam) ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది. తొమ్మిది రోజుల పాటూ ఘనంగా పూజలందుకున్న లంబోదరుడు భక్తుల జయ జయ ధ్వానాల నడుమ కోలాహలంగా గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు. అమలాపురంలోని షరాబుల పందిరిలో వినాయక ఉత్సవాలు తీన్మార్ , కేరళ డప్పు వాయిద్యాలు, కోయ, గరగ నృత్యాలతో పాటు డూప్ సినీ నటుల ప్రదర్శనలు గణేష్ నిమజ్జనోత్సవం లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా పలువురు తమ అభిమాన హీరోల వేషాలు ధరించి సందడి చేశారు. కొందరు సినీ నటులు చిరంజీవి(Mega star chiranjevi), పవన్ కళ్యాణ్(Powar star pawan kalyan) ,బాలకృష్ణ(Nandamuri Balakrishna) ల రెడీ అయి ఫాన్స్ ను సంతోషం పెట్టారు. స్టేజ్ పై రియల్ హీరోస్ మాదిరి ప్రదర్శనలు చేసారు. వీరి చేసే హంగామా చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి లాగా డాన్స్ వేశారు.
This browser does not support the video element.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని చేసి చూపించారు. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ లాగా రెడీ అయి ఆయన చెప్పే రితిలో డైలగ్స్ చెప్పారు. ఇలా ముగ్గురు హీరోల యాక్టింగ్ లతో జనాలను కేరింతలు కొట్టించారు.
This browser does not support the video element.
కాగా, వెంకటేశ్వర స్వామి వేషధారణ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ విధంగా అమలాపురం శరబుల ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తున్నారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో మహా వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు.
Also Read: యాక్షన్ డ్రామాలో రామ్ సెట్ అయ్యాడా? స్కంద మూవీ రివ్యూ