MLC By Poll : ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ (Khammam-Nalgonda-Warangal) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు (MLC Elections) ఈ నెల 27న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాటికి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ (Polling) జరగనుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ (BRS) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.
Also Read: గూగుల్ మ్యాప్‌ని నమ్మి.. నట్టేట మునిగారు..!
ఈ ఎన్నికల్లో 4.63 లక్షల మంది పట్టభద్రులు (Graduates) ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూన్ 5న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. మరి ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Also Read: 2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల.. సెలవులు, పరీక్షలు ఎప్పుడంటే