Fastags: వాహనదారులకు శుభవార్త..ఇక నుంచి ఫాస్టాగ్స్ ఉండవు..కేంద్రం కీలక నిర్ణయం..!!

ఫాస్టాగ్స్ స్థానంలో త్వరలోనే దేశమంతటా హైవేలపై జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. 2024లోకసభ ఎన్నికలకు ముందు ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు విధానాన్ని అమలు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది.

New Update
Election Commission: కొత్త టోల్‌ రేట్లు ఎన్నికల తరువాతే: ఎన్నికల కమిషన్‌!

Fastags: గతంలో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు మాన్యువల్ టోల్ ఛార్జీలు చెల్లించేవారు. తర్వాత ఆటోమెటిగ్గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు దీని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ (GPS) ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి. అందులో తగిన క్యాష్ ఉండాలి. ప్రతిసారీ ఇలాంటి తలనొప్పులు లేకుండా ఫాస్టాగ్ లనుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ కు మారాలని కేంద్రంలోని మోదీ సర్కార్ భావిస్తోంది. దీనివల్ల హైవే ప్రయాణం మరింత సాఫీగా, వేగంగా మారనుంది.

ఫాస్టాగ్స్ స్థానంలో త్వరలోనే దేశమంతటా హైవేలపై జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. దేశంలో ఎన్నికలకు వెళ్లే వారాల ముందు ఈ ఏడాది ఏప్రిల్లో ఈ మార్పు జరిగే అవకాశం ఉంది. 2024లోకసభ ఎన్నికలకు ముందు ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు విధానాన్ని అమలు చేయవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అమలులో మొదటి దశల్లో ఒకటిగా కేంద్రం జాతీయ రహదారులపై జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ కోసం ఒక కన్సల్టెంట్ ను నియమించింది.

2021 నుంచి హైవేలపై టోల్ లు చెల్లించడానికి అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగులను తప్పనిసరి చేసింది. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ రుసుమును జరిమానాగా చెల్లించాలి. అయితే ఇది అమల్లోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఫాస్ట్ ట్యాగ్ లను దశలవారీగా తొలగించే అవకాశం ఉంది. కొత్త సిస్టమ్ హైవేల వద్ద అమర్చిన కెమెరాల ద్వారా ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ను ఉపయోగిస్తుంది. వాహనం ప్రయాణించే దూరం ఆధారంగా టోల్స్ తీసివేస్తుంది. ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ లు ప్లాజాల్లో RFIDఆధారిత టోల్ సేకరణణు ఉపయోగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:  అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్..ఈ జిల్లా నుంచి నేరుగా రైలు..పూర్తి వివరాలివే..!!

కాగా జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ అనేది ఒక కొత్త టెక్నాలజీ. ప్రస్తుతం దీనిని ముంబైలోని అటల్ సేతు వంటి కొన్ని రహదారులపై టెస్ట్ చేస్తున్నారు. ప్రత్యేక కెమెరాలతో కదిలే వాహనాల నెంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తుంది. ఆ కెమెరాల్లో ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజితో వర్క్ అవుతాయి. ఈ సిస్టమ్ లో వెహికల్ రిజిస్ట్రేషన్ లింక్ అయిన బ్యాంకు అకౌంట్ నుంచి టోల్ డబ్బులు డెబిట్ అవుతాయి. జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ ఫాస్టాగ్ లకంటే అనేకు ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది. 2024 ఏప్రిల్ ప్రారంభంలో జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ ను దేశవ్యాప్తంగా ప్రారంభించాని కేంద్రం భావిస్తోంది.

ఇది కూడా చదవండి: కేసీఆరే టార్గెట్.. సీఎం రేవంత్ వ్యూహాలు.. కేసీఆర్‌కు షాక్ తప్పదా?

Advertisment
Advertisment
తాజా కథనాలు