Manish Sisodia: గవర్నర్ పదవి రద్దు చేయాలి.. మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు ఎన్డీయే అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వ తీరుకు ఆటంకం కల్పిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు.ఇది ప్రజాస్వామ్యానికి భారమని.. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయడమే మేలని ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. By B Aravind 14 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వ తీరుకు ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాంటి పదవి ప్రజాస్వామ్యానికి భారమని.. దాన్ని రద్దు చేయడమే మేలని పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ' ఎన్నికల్లో గెలిచిన నేతలు, గవర్నర్ మధ్య జరుగుతున్న వాగ్వాదం వల్ల ఢిల్లీలో బ్యూరోక్రాట్లు ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరంగా మారుతోంది. అసలు రాష్ట్రాలకు గవర్నర్ పదవి ఎందుకు ?. ఎన్నికైన నాయకులతో ప్రమాణం చేయించడానికేనా ?. ఇలాంటి పని ఇతరులతో కూడా చేయించవచ్చు. దీన్ని రద్దు చేయడమే మేలని' సిసోడియా అన్నారు. Also Read: ఎస్‌బీఐ, పీఎన్‌బీలు కట్..కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం ఇదిలాఉండగా.. ఢిల్లీ లిక్కర్ లిక్కర్ కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియా ఇటీవల తీహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 17 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే గవర్నర్ పదవిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. Also Read: ఢిల్లీలో మరో దారుణం.. మహిళా ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారం! #delhi #national-news #manish-sisodia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి