Governor Tamilisai : తెలంగాణ(Telangana) లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Assembly Budget Meetings) మొదలయ్యాయి. మొదటగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundararajan) మాట్లాడారు. ఈ మేరకు కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక సంస్కరణలు చేపడుతున్నాని తెలిపారు.
పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం..
అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల్లో రెండు అమలుచేసినట్లు ఆమె గుర్తు చేశారు. త్వరలోనే మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని, ఇందుకు సంబంధించి ఏర్పాటు కూడా జరుతున్నాయన్నారు. అంతేకాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఆరు గ్యారంటీలను తప్పకుండా నేరవేరుస్తామని సభ వేదికగా వెల్లడించారు.ఇక గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. గత పాలకుల అసమర్థత కారణంగా చిన్నాభిన్నమైన రాష్ట్ర వ్యవస్థను ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అలాగే ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందరికీ అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
40వేల కోట్ల విదేశీ పెట్టుబడులు ..
'ఐటీ ఫార్మా రంగాలకు(IT Pharma Companies) మా సహకారం కొనసాగుతుంది. సీఎం అయిన కొద్ది రోజుల్లోనే విదేశీ పెట్టుబడులు 40వేల కోట్లకు పైగా తీసుకువచ్చే లా కృషి చేశాం. ఇప్పటి వరకు మూసి నది నిర్లక్ష్యం కు గురైంది. ప్రజలకు అన్ని విధాల ఈ నది ఉపయోగపడేలా చేస్తాం.యువత నైపుణ్య శిక్షణ లో భాగం గా నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేస్తాం. బడ్జెట్ అనేది కేవలం పత్రం మాత్రమే కాదు ఇది మా ఉమ్మడి భవిష్యత్ కి ఒక నమూన. గత పదేళ్ల పాలన లో ఖర్చు నిర్వహణలో కేసిఆర్ ప్రభుత్వం వివేకం గా వ్యవహరించలేదు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రెండు లక్షల ఉద్యోగాల భర్తీ..
అలాగే తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతతో ఉన్నానమన్నారు. ఎన్నికల్లో ప్రజాభిప్రాయం స్పష్టంగా ప్రతిధ్వనించిందని, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన సాగించడం మా లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మన్మోహన్ సింగ్, సోనియా గాంధీకి మా ప్రభుత్వం రుణపడి ఉంటుందన్నారు. నిర్దిష్ట సమయంలో 6 గ్యారంటీ లు అమలు చేస్తాం.త్వరలో మరో రెండు గ్యారంటీ లు 500 లకే గ్యాస్ సిలెండర్, 2వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. అన్ని వర్గాలకు ఇచ్చిన వాగ్దానాల లు కట్టుబడి ఉన్నాం.కొత్తగా ఏర్పాటు అయిన TSPSC బోర్డు ద్వారా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. వ్యవసాయ రంగానికి ఇచ్చిన వాగ్ధానాలు రైతు భరోసా,రైతు పంట రుణమాఫీ కి కట్టుబడి ఉన్నామన్నారు.
కంచెను తొలగించాం..
'అలాగే అర్హులకు 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం. గత సమావేశాల్లో ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశాం.రెండు లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నాం. దేశానికి హైదరాబాద్ ను ఏఐ రాజధానికి మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించాం. దశాబ్దకాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాం'అని గవర్నర్ తెలిపారు. ఇక చిన్న పరిశ్రమల అభివృద్ధికోసం MSME పాలసీ అమలు చేయబోతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : Telangana: ఆరు గ్యారెంటీల అమలుకు ఇంత ఖర్చు అవుతుంది.. కాంగ్రెస్ లెక్కలు ఇవే
ఇదిలావుంటే.. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 10వ తేదీన అసెంబ్లీలో 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన మండిలిలో.. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.