Telangana : ఎమ్మెల్సీలను నియమించిన గవర్నర్

గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీలను నియమించారు గవర్నర్ తమిళిసై. ఎమ్మెల్సీలు గా తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమేర్ అలీ ఖాన్ ను నియమించారు.

Telangana : ఎమ్మెల్సీలను నియమించిన గవర్నర్
New Update

Telangana MLC's: తెలంగాణలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీల స్థానాలపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండు స్థానాలను భర్తీ చేశారు. ఎమ్మెల్సీలు గా తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodandaram) , మీర్ అమేర్ అలీ ఖాన్ ను నియమించారు. రేవంత్ సర్కార్ ప్రతిపాదలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.

ALSO READ: TSPSC ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

రేవంత్ వల్లే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి నిన్న (బుధవారం) గవర్నర్ తమిళిసై ను రాజా భవన్ కి వెళ్లి కలిశారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలు, అలాగే TSPSC ఛైర్మన్ నియామకంపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) తో చర్చించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, అలాగే ముస్లిం సామాజికవర్గానికి చెందిన జర్నలిస్ట్ అమిర్ అలీ ఖాన్ పేర్లను ఎమ్మెల్సీ పదవి కోసం సీఎం రేవంత్ గవర్నర్ తమిళిసై కు సూచించినట్లు సమాచారం.

తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పు ఇచ్చిన తరువాతే గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు చేస్తా అని గతంలో చెప్పిన గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అనంతరం తరువాతి రోజే ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసింది.

మంత్రిగా కోదండరాం...?

గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ (Telangana MLC) స్థానాలను భర్తీ చేశారు గవర్నర్ తమిళిసై. ఎమ్మెల్సీ గా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను నియమించారు గవర్నర్ తమిళిసై. ఇదిలా ఉండగా తాజాగా ప్రొఫెసర్ కోదండరాంకు రేవంత్ కేబినెట్ లో చోటు దక్కుతుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఆయనను మంత్రి చేయడం కోసమే రేవంత్ సర్కర్ ఎమ్మెల్సీ పదవి కోసం ప్లాన్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తన పూర్తి మద్దతును ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ప్రొఫెసర్ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేస్తుందా? లేదా? అని వేచి చూడాలి.

ASLO READ: చంద్రబాబు స్క్రిప్ట్.. షర్మిల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్D

#mlc #governor-tamilisai #amanulla-khan #telangana-mlc #professor-kodandaram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe