Apple Users Beware: ఆపిల్‌ యూజర్లను అలర్ట్ చేసిన సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ..వెంటనే ఏం చేయాలంటే?

ఆపిల్ యూజర్లను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఆపిల్ యూజర్లంతా అప్రమత్తంగా ఉండాలంటూ హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. రిమోట్ కోడ్ లో కొన్ని లోపాలను గుర్తించినట్లు Cert-In తెలిపింది.

New Update
Apple Users Beware: ఆపిల్‌ యూజర్లను అలర్ట్ చేసిన సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ..వెంటనే ఏం చేయాలంటే?

Apple Users Beware: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఐఫోన్లు, మాక్ బుక్స్, ఐప్యాడ్ లు, విజన్ ప్రో హెడ్‌సెట్‌లతో సహా వివిధ ఆపిల్ ఉత్పత్తుల వినియోగదారులకు సంబంధించి "హై-రిస్క్" హెచ్చరికను జారీ చేసింది. కొన్ని లోపాల కారణంగా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసిన పరికరాల్లో కొన్ని కోడ్స్ రన్ చేసి డివైజులను తమ కంట్రోల్లోకి తీసుకునే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఐఫోన్, ఐప్యాడ్, ఓఎస్ వెర్షన్స్ 17.41కంటే ముందున్న డివైజులు ఈ కారణంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఈ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది.

ఐఫోన్ ఎస్ఎస్ తర్వాత వెర్షన్ 12.9 అంగుళాల రెండో తరం ఐప్యాడ్ ప్రో తర్వాత తరం డిజైజుల్లో ఈ వెర్షన్ ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 10.5అంగుళాల ఐప్యాడ్ ప్రో, తొలి జనరేషన్ 11అంగుళాల ఐప్యాడ్ ప్రో తర్వాత జనరేషన్ డివైజులు సహా మరిన్ని ఆపిల్ డివైజులు ఈ కారణంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

దీంతోపాటు 16.77 అప్‌డేట్‌ కంటే ముందున్న ఐఓఎస్, ఐప్యాడ్‌ వెర్షన్‌ కూడా ప్రభావితం కానున్నాయని తెలిపింది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X, ఐప్యాడ్‌ జెన్‌ 5, 12.9 అంగుళాల జెన్‌ 1 ఐప్యాడ్‌ ప్రో, 9.7 అంగుళాల ఐప్యాడ్‌ ప్రో వంటి డివైసులు ఈ 16.77 అప్‌డేట్‌ పైన రన్న అవుతున్నాయి. వీటితోపాటు ఆపిల్‌ సఫారీ 17.41 కంటే ముందున్న వెర్షన్‌లు కూడా ఈ లోపాల కారణంగా ప్రభావితం కానున్నాయని సైబర్‌ వాచ్‌ డాగ్‌గా వ్యవహరించే ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ టీం అలర్ట్ చేసింది. 13.6.6 కంటే ముందున్న macOS Venture వెర్షన్, 14.4.1 కంటే ముందున్న macOS sonoma వెర్షన్లు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఈ భద్రతా లోపాల కారణంగా కొన్ని లింక్‌లపైన క్లిక్‌ చేయమని యూజర్లను సైబర్‌ నేరగాళ్లు సూచించవచ్చని, పొరపాటున వాటిని క్లిక్‌ చేస్తే ఆ పరికరం నియంత్రణ హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లిపోతుందని హెచ్చరించింది.దీంతో వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారం దొంగిలించబడే అవకాశం ఉందని పేర్కొంది. ఇటువంటి సందర్భాల్లో తమ పరికరాల భద్రత కోసం ఎప్పుడూ కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లను కలిగి ఉండాలని తెలిపింది. ఆపిల్ రిలీజ్ చేసే  సెక్యూరిటీ అప్‌ డేట్‌లను ఇన్‌ స్టాల్‌ చేసుకోవాలి. పబ్లిక్‌ నెట్‌ వర్క్ వైఫైలకు కనెక్ట్ అయినప్పుడు మరింత అలర్ట్ గా ఉండాలి.  అవసరమైన యాప్‌, సాఫ్ట్‌వేర్‌లను యాప్‌ స్టోర్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ముఖ్యమైన డేటాను బ్యాకప్‌ చేసుకోవాలని పేర్కొంది. ఫలితంగా భద్రతా సహా ఇతర సమస్యల కారణంగా డేటా కోల్పోయే అవకాశం ఉండదని భద్రత సంస్థ తెలిపింది. దీంతోపాటు సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు సహా ఆపిల్‌ సంస్థ నుంచి వచ్చే భద్రతా సూచనలను కూడా పాటించాలి.

ఇది కూడా చదవండి: తీహార్ జైల్లో కేజ్రీవాల్ కు ప్రాణహాని…హై అలర్ట్ లో గార్డ్స్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు