కేంద్రం కీలక నిర్ణయం.. ఆధార్ తరహాలో సిమ్ కార్డులకు ఐడీ!

ప్రజల వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డు తరహాలో సిమ్ కార్డులకు కస్టమర్ ఐడీ కేటాయించనున్నట్లు సమాచారం.

New Update
కేంద్రం కీలక నిర్ణయం.. ఆధార్ తరహాలో సిమ్ కార్డులకు ఐడీ!

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. సైబర్ నేరగాళ్ల భారిన పడేవారి సంఖ్య కూడా రోజుకు రోజుకూ గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ల(Cyber Crime) నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకరానున్నట్లు సమాచారం. మొబైల్ సిమ్ కార్డు(Sim Cards)ల హ్యాకింగ్‌తో జరుగుతున్న మోసాలను కట్టడి చేసేందుకు కఠిన నిబంధలను పెట్టనుంది. కేవైసీ(KYC) నిబంధనలతోనే వ్యక్తులకు సిమ్ కార్డులు ఇవ్వాలని.. భారీగా సిమ్ కార్డు విక్రయాలను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

సిమ్ కార్డు హ్యాకింగ్(Hacking)ను అరికట్టేందుకు మొబైల్ ఫోన్(Mobile Phone) యూజర్లకు ఆధార్ కార్డు(Aadhar Card) తరహాలో సరికొత్త కస్టమర్ ఐడీ రూపంలో విశిష్ట ఐడీ నంబర్ జారీ చేయాలనీ కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నంబర్ సాయంతో ప్రధాన మొబైల్ సిమ్ కార్డుతోపాటు అనుబంధ ఫోన్ కనెక్షన్లను గుర్తించడానికి వీలు ఉంటుందని నిఆ పుణులు తెలుపుతున్నారు. దీన్ని త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ట్రయల్స్ చేస్తుందట. ఇది అమల్లోకి వస్తే మొబైల్ ఫోన్లు హ్యాకింగ్ భారిన పడే అవకాశం తగ్గనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా హ్యాకర్ ఎక్కడ నుంచి దీన్ని ఆపరేట్ చేస్తున్నాడనే సమాచారం కూడా పొందవచ్చని అంటున్నారు.

కస్టమర్ ఐడీ ద్వారా మీరు ఎక్కడ నుంచి, ఏ ఫోన్లో మాట్లాడుతున్నారనే విషయం కూడా ప్రభుత్వం తెలుసుకోగలుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, ఇది అందుబాటులోకి వస్తే వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే సైబర్ మోసాల నుంచి ప్రజలకు భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే డేటా ప్రొటెక్షన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. అయితే కస్టమర్ ఐడీ అమలుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Advertisment
తాజా కథనాలు