TS: టీచర్లకు తెలంగాణ సర్కార్ షాక్.. ఆ డిమాండ్ కు నో! ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. పదోన్నతులు పొందేందుకు ప్రత్యేక టెట్ నిర్వహించాలనే డిమాండ్లను తిరస్కరించింది. టీచర్ అభ్యర్థులతో కలిసి టెట్ రాయాల్సిందేనని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. By srinivas 28 Mar 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Teacher: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. పదోన్నతులు పొందేందుకు టెట్ రాయాలనుకునే ఉపాధ్యాయుల డిమాండ్లను తిరస్కరించింది. ఈ మేరకు మార్చి 14న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) నోటిఫికేషన్ విడుదలవగా ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ బుధవారం మార్చి 27న ప్రారంభమైంది. ఏప్రిల్ 10న అప్లికేషన్ గడువు ముగియనుంది. నిబంధన తప్పనిసరి.. ఈ క్రమంలో టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు టెట్‌లో అర్హత సాధించాలనే నిబంధనను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. సర్విస్ లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ రాయడానికి ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని, వారికోసం ప్రత్యేక టెట్ నిర్వహించే అవకాశం లేదని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. అందరితోపాటు టెట్ రాయాల్సిందేనని తెలిపింది. ఇది కూడా చదవండి: Bandi sanjay: చెంగిచర్ల పాకిస్తాన్ లో ఉందా? రాజాసింగ్ హౌజ్ అరెస్ట్ పై బండి ఫైర్! ప్రత్యేక టెట్.. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్‌కు, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్‌ఎంగా పదోన్నతి పొందాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి. దీంతో టీచర్ అభ్యర్థుల కోసం నిర్వహించే టెట్‌లో అర్హత సాధించడం కష్టంగా ఉండటంతో తమ కోసం ప్రత్యేక టెట్‌ను నిర్వహించాలని కొంత కాలంగా ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. #tet #telangana-teachers #rejection-of-demand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి