BCCI: కొన్ని లక్షల మందికి రోల్ మోడల్స్ గా నిలిచే క్రీడాకారులు పొగాకు, మద్యం సంబంధిత ప్రకటనలు చేయకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ , భారత క్రీడా ప్రాధికార సంస్థ లకు సూచనలు చేసింది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి క్రికెటర్లు, అథ్లెట్లు మార్గదర్శకులని తెలిపింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, శాయ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సందీప్ ప్రధాన్ కు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ అతుల్ గోయల్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
''దేశంలో క్రికెట్ వ్యాప్తి కోసం బీసీసీఐ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. క్రికెటర్లు, అభిమానుల కోసం విధానాలు, మార్గదర్శకాలను రూపొందించడంలో ఆ సంస్థ నుంచి పని తీరు కనబరుస్తోంది. అయితే ఐపీఎల్ లేదా ఇతర క్రికెట్ మ్యాచ్ ల సమయంలో పొగాకు, ఆల్కహాల్ ప్రకటనలు చూడటం బాధాకరమైన విషయం. ఇలాంటి సమయంలో ప్రముఖ క్రికెటర్లు యాడ్స్ లో కనిపించడం వల్ల యువత పై దుష్ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
సంబంధిత అంశం పై బీసీసీఐ దృష్టిసారించాలని కోరుతున్నామని కేంద్రం పేర్కొంది. ఇలాంటి ప్రకటనల్లో క్రికెటర్లు పాల్గొనకుండా చూడాలని విజ్ఙప్తి చేస్తున్నాం. బీసీసీఐ నిర్వహించే మ్యాచ్ లు, ఐపీఎల్ టోర్నీ సమయంలో కేవలం క్రికెటర్లు మాత్రమే కాకుండా..ఇతర ప్రముఖులు ఎవరైనా సరే పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ ప్రకటనలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం పేర్కొంది.
Also read: 15 వేల మందిని తొలగించేందుకు రెడీ అయిన ప్రముఖ టెక్ కంపెనీ!