TSPSC : టీఎస్పీఎస్ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్.

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదించలేదు. బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించలేమని తేల్చి చెప్పారు. పేపర్ లీకులకు జనార్ధన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ గవర్నర్ doptకి లేఖ రాశారు.

TSPSC : టీఎస్పీఎస్ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్.
New Update

Jana Reddy Resign : టిఎస్ పిఎస్ సి(TSPSC)  ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి(Jana Reddy) రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు వస్తున్న వార్తలను రాజభవన్ వర్గాలు తెలిపాయి. పేపర్ లీకులకు బాధ్యలు ఎవరో తేల్చకుండా రాజీనామాను అమోదించొద్దని గవర్నర్ తమిళసై(Tamilisai) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనార్ధన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ గవర్నర్ doptకి లేఖ గవర్నర్ లేఖ రాశారు. ప్రస్తుతం గవర్నర్ తమిళ సై పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు.

Also read:మన్సూర్ అలీఖాన్ కు చివాట్లు పెట్టిన చెన్నై హైకోర్టు

అంతకు ముందు పేపర్ లీక్ పై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని టిఎస్పిఎస్సిని ఆదేశించారు. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని..అసలైన అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. కాగా ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ సహా 9 మందిని అరెస్ట్ చేశారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో 14 రోజుల రిమాండ్ కు కోర్టు అనుమతించింది.  ఈ కేసు దర్యాప్తును సిట్ (Special Investigation Team) కు అప్పగిస్తూ సీపీ సీవీ ఆనంద్  ఆదేశాలు జారీ చేశారు. సిట్ చీఫ్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది.

#resignation #chairman #governor-tamilisai #tspsc #governer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి