Google Services : నిలిచిన గూగుల్ సేవలు.. ట్విట్టర్‌లో విమర్శలు

గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్ యూజర్లు సెర్చ్ ఇంజన్ ప్రపంచవ్యాప్తంగా పని చేయడం లేదని ట్విట్టర్ (X)లో పోస్ట్ చేస్తున్నారు. అలాగే గూగుల్ సంస్థకు చెందిన గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, జీమెయిల్ వంటి యాప్స్ పనిచేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు.

New Update
Google Services : నిలిచిన గూగుల్ సేవలు.. ట్విట్టర్‌లో విమర్శలు

Trouble In Google Services : గూగుల్(Google) సేవలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్ యూజర్లు సెర్చ్ ఇంజన్(Search Engine) ప్రపంచవ్యాప్తంగా పని చేయడం లేదని ట్విట్టర్(X) లో నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. డౌన్‌ డిటెక్టర్  తెలిపిన వివరాల ప్రకారం.. యూకేలో 300 మంది వినియోగదారులు, అమెరికాలో గూగుల్ ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. 1,400 మంది వ్యక్తులు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు 505 error వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా న్యూయార్క్, డెన్వర్, కొలరాడో, సీటెల్‌లో ఈ సమస్య ఎక్కువగా వచ్చిందని తెలిపింది. గూగుల్ యొక్క జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ వంటి ఇతర సేవలకు అంతరాయం ఏర్పడినట్టు పేర్కొంది.

Also Read : దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్న నవీన్ చంద్ర!

Advertisment
Advertisment
తాజా కథనాలు