Paris Olympics: ఒలింపిక్స్‌కు ప్రత్యేకమైన గూగుల్ డూడుల్

పారిస్ ఒలింపిక్స్ కోసం గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌ను తయారు చేసింది. దాంతో పాటూ యూజర్లు డూడుల్‌ మీద క్లిక్ చేయగానే ఒలింపిక్స్ కు సంబంధించిన అప్‌డేట్‌లు వచ్చేలా పేజీలను డిజైన్ చేసింది.

New Update
Paris Olympics: ఒలింపిక్స్‌కు ప్రత్యేకమైన గూగుల్ డూడుల్

Google Doodle: స్పెషల్ డేలు, ఈవెంట్లు ఉంటే వాటని గుర్తు చేయడానికి, ప్రత్యేకతను చాి చెప్పడానికి గూగుల్ ల్లప్పుడూ ముందుంటుంది. ఆ రోజుకు తగ్గట్టుగా ప్రత్యైకమైన డూడుల్‌ను తయారు చేసి ఉంచుతుంది. భారత కాలమాన ప్రకారం నిన్న అర్ధరాత్రి మొదలైన పారిస్ ఒలింపిక్స్ కు గుర్తుగా గూగుల్ స్పెషల్ డూడుల్‌ను డిజైన్ చేసింది. పారిస్‌ వెంబడి ప్రవహించే ‘సీన్‌ నది’ని తలపిస్తూ ఐదు ఖండాల క్రీడాకారులను రిప్రజెంట్‌ చేసేలా వివిధ జీవులతో డూడుల్‌ను రూపొందించింది. ఐదు డక్స్ పారిస్ సీన్‌ నదిలో రిలాక్స్ అవుతున్నట్టు డూడుల్‌ను రూపొందించింది గూగుల్.

ఇక పారిస్ ఒలిపింక్స్ అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. వందేళ్ళ తర్వాత విశ్వక్రీడలకు ఆతిధ్యమిస్తున్న ఫ్రాన్స్ ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. దాదాపు 10,500 మంది అథ్లెట్లు 100 బోట్లలో పరేడ్ చేశారు. సీన్‌ నదిలోని ఐకానిక్ బ్రిడ్జిలు, ల్యాండ్ మార్క్‌లను దాటుకుంటూ.. సీన్ నదిలో ఆరు కిలోమీటర్ల మేర అథ్లెట్ల బోట్ పరేడ్ కొనసాగింది. ఈ వేడుకల్లో మొత్తం 3వేల మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.


Also Read:Paris Olympics: తెలంగాణ బిడ్డకు కఠినమైన డ్రా

Advertisment
తాజా కథనాలు