Liquor: తెలంగాణలో నేటితో ముగియనున్న మద్యం టెండర్లు.. భారీగా పెరుగుతున్న పోటీ

తెలంగాణలో నేటితో మద్యం టెండర్లు ముగుస్తున్నాయి. చివరి రోజు కావటంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. దీనికోసం ఎక్సైజ్ కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒక్కో దుకాణానికి 50 నుంచి 200 దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

Telangana News: తెలంగాణలో మందుబాబులకు షాక్.. 3 రోజులు వైన్స్ బంద్.. ఎందుకంటే?
New Update

Liquor Shops Tenders Last Date in Telangana: నిజామాబాద్ జిల్లాలో మద్యం టెండర్లకు మంచి స్పందన వచ్చింది. టెండర్లు వేసేందుకు వ్యాపారులు భారీగా పోటీ పడ్డారు. నిన్న ఉమ్మడి జిల్లాలో 1405 టెండర్లు దాఖలయ్యాయి. ఇవ్వాళ్టితో టెండర్ల దాఖల గడువు ముగుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 3094 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇక చివరి రోజు కావటంతో టెండర్లకు భారీగా దాఖలు అయ్యే అకాశాలు ఉన్నట్లు తెలిపారు.

అయితే.. ఈ టెండర్లు వేసేందుకు వ్యాపారులు భారీగా పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతుందన్నారు. నిజామాబాద్ పరిధిలో 404, బోధన్ 134, ఆర్మూర్ 172, భీమ్‌గల్ 113, మోర్తాడ్‌ పరిధిలో మొత్తం 960 దరఖాస్తులు వచ్చాయిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11 రోజులుగా ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్లు 1706 వరకు చేరిందని అధికారులు తెలిపారు. ఈ పోటీలో నిన్నటి వరకు 50 శాతం టెండర్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజు కావడంతో అంచనాల కన్నా ఎక్కువ అప్లికేషన్లు వస్తాయని అధికారులు తెలిపారు.

ఇక కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 49 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. దీంతో జిల్లాలోని వ్యాపారుల నుంచి స్పందన భారీగా వచ్చింది. జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు 1388 దరఖాస్తులు రాగ.. గురువారం ఒక్కరోజు 445 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజుతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్టేషన్ల వారీగా పరిశీలిస్తే.. కామారెడ్డి స్టేషన్‌ పరిధిలో 469, రోమకొండ పరిధిలో 273, ఎల్లారెడ్డి 204, బాన్సువాడ 220, బిచ్చుంద 222 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

Also Read: కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

#liquor #nizamabad-district #end-today-in-telangana #liquor-shops-tenders-last-date-in-telangana #wine-shop-tender-telangana #telangana-liquor-shops-tenders
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe