Telangana Congress Free Bus Scheme: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం రావడంతోనే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో (Congress 6 Guarantees) రెండు గ్యారెంటీలు డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ శనివారం నుంచి మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. గురువారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేరుగా సచివాలయం చేరుకుని.. మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు వెళ్లడించారు మంత్రి శ్రీధర్ బాబు. ఆరు గ్యారెంటీల్లో ముందుగా రెండు గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఆరోగ్య శ్రీని రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
ఉచిత బస్ ప్రయాణానికి ఇది తప్పనిసరి..
ఉచిత బస్సు ప్రయాణం పథకంలో (Free Bus Scheme) భాగంగా బస్సులో ప్రయాణించే మహిళలు తమ ఆధార్ కార్డును చూపిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. మహిళలకు కూడా టికెట్ ఇస్తారని, అయితే.. సున్నా ఛార్జి టికెట్లు జారీ చేస్తారని అధికారులు తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంటుంది.
డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు..
ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వెల్లడించారు. ఆ రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. ఇక మంత్రి వర్గ కూర్పుపై ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Also Read:
నేడు ఉదయం విద్యుత్ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!!