Telangana Rains: తెలంగాణకు చల్లటి కబురు.. రేపటి నుంచి వానలే వానలు!

ఎండలతో ఉక్కురిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రేపటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.

New Update
Telangana Rains: తెలంగాణకు చల్లటి కబురు.. రేపటి నుంచి వానలే వానలు!

Rain Alert to Telangana: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రతీరోజు భానుడు భగభగ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 తర్వాత ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. తీవ్రమైన వేడి, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్న ఈ సమయంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పిడుగులతో కూడిన వర్షాలు:

రాబోయే మూడు రోజులు రెయిన్ అలర్ట్‌ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రేపు రాష్ట్రంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన.. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 10వ తేదీ వరకూ వర్ష సూచన ఉంటుందన్నారు. వరంగల్, హనుమకొండ, నల్గొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

క్యుములోనింబస్ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు, దక్షిణ జిల్లాలు, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో నిన్న 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.

ఇది కూడా చదవండి:  వాల్‌నట్‌తో ఇంట్లోనే ఫేస్ స్క్రబ్‌ను ఇలా తయారు చేసుకోండి.. తేడా గమనించండి!

Advertisment
తాజా కథనాలు