New Ration Cards : గుడ్ న్యూస్...జనవరిలో కొత్త రేషన్ కార్డులు...కానీ అంత ఈజీగా ఇవ్వరట..!! కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. జనవరిలోనే కొత్త కార్డులు ఇచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అయితే అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటోంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ అర్హులా కాదా అనేది నిర్ణయిస్తారు. By Bhoomi 27 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి January 2024 : కొత్త రేషన్ కార్డు(New Ration Card) కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ(Telangana) ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చేనెలలో అంటే జనవరిలో కొత్త రేషన్ కార్డు లను అందించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు షురూ చేసింది. గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే ఈసారి కొత్త రేషన్ కార్డు జారీని పకడ్బందీగా చేయనున్నారు. కేవలం అర్హులైన వారికి మాత్రమే ఇవ్వనున్నారు. మొదట స్క్రూటీని చేసి... ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. అర్హులను నిర్దారించుకున్న తర్వాతే..జనవరిలోనే వారికి కార్డులు అందించనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి అనుసరించాల్సిన విధానాన్ని, అర్హతలను పరిగణలోనికి తీసుకోవల్సిన అంశాలతో ఇప్పటికే మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 24న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షత జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఐదు పేజీల డాక్యుమెంటును పౌరసరఫరాల శాఖ అందజేసింది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవల్సిందిగా అన్ని గ్రామాల్లో విస్త్రుతంగా ప్రచారం చేయాలని డాక్యుమెంట్లలో పౌరసరఫరాల శాఖ తెలిపింది. డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, చెకింగ్ ఇన్ స్పెక్టర్ లో ఎవరో ఒకరు గ్రామాల్లో తిరిగి ప్రజలకు దరఖాస్తుల గురించి వివరిస్తారు. దరఖాస్తులను పరిశీలించేందుకు ఫిజికల్ వెరిఫికేషన్ చేసేందుకు జిల్లా కలెక్టర్(Collector) నుంచి తహశీల్దార్ వరకు పటిష్టమైన మెకానిజానికి సంబంధించిన అంశాలను ఆ డాక్యుమెంట్లో పొందుపరిచారు. దరఖాస్తు చేసుకున్న వారి ప్రతి ఇంటికి వెళ్లి అధికారులు వెరిఫికేషన్ చేస్తారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సేకరించి వాటికి నెంబరింగ్ ఇస్తారు. ఆ వివరాలను సంబంధిత తహశీల్దార్లు లేదా అసిస్టెంట్ సివిల్ సప్లయిస్ ఆఫీసర్ కు అందజేస్తారు. మండలస్ధాయిలో తహశీల్దార్లు నోడల్ అధికారిగా వ్యవహారిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షిస్తారు. ఎక్కడ తేడా వచ్చిన అధికారులతో బాధ్యత ఉంటుంది. వారే జవాబుదారీగా ఉంటారు. ఇక అటు 6 గ్యారెంటీ అమలుకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం మిగిలిన పథకాల అమలుకు లబ్దిదారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు నిర్వహించనుంది ప్రభుత్వం. ప్రతీ గ్రామం, వార్డులో ప్రజాపాలన సభలను నిర్వహిస్తారు. ఈ సభల్లో 6 గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ప్రతీరోజు రెండు సభలను ఏర్పాటు చేసి..మండలస్థాయి అధికారులు తహసీల్దార్, ఎంపీడీవో ఒక్కోసభకు సారధ్యం బాధ్యత వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఒక సభను..మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరోసభను నిర్వహించనున్నారు. ఈ సభలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తప్పని సరిగా హాజరవుతారు. ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి(Mahalaxmi Scheme), రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పథకాలపై దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటో ను దరఖాస్తుదారులు జత చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తుపత్రంతో పాటు ఆధార్, ఫోటో ఇవ్వాలి. ఇది కూడా చదవండి: శబరిమల ఏర్పాట్లపై బీజేపీ, కాంగ్రెస్ ఫైర్..కనీసం నీరు కూడా ఇవ్వారా అంటూ..! #telangana #cm-revanth-reddy #new-ration-cards మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి