Good News: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

సిద్దిపేట ప్రజలకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి సిద్దిపేట జిల్లాలో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 3న సికింద్రాబాద్‌-సిద్దిపేట మధ్య రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయని రైల్వే శాఖ తెలిపింది.

New Update
Good News: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

సిద్దిపేట ప్రజలకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి సిద్దిపేట జిల్లాలో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 3న సికింద్రాబాద్‌-సిద్దిపేట మధ్య రైలు సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ నగరాల మధ్య తిరిగే ట్రైన్ సిద్దిపేట నుంచి ప్రారంభం కానుందని స్పష్టం చేసింది. మొదట అక్టోబర్ 3న రెండు ప్యాసింజర్‌ ట్రైన్స్‌ నడుతామని తెలిపిన దక్షిణ మధ్య రైల్వే.. అనంతరం రద్దీని బట్టి ట్రైన్ సర్వీసులను పెంచేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

కాగా మొదట కాచిగూడ నుంచి సిద్దిపేటకు రైలు సర్వీసులను నడపాలపి భావించిన రైల్వే శాఖ.. కానీ సిద్దిపేట నుంచి వచ్చే ప్రయాణికులు ఎక్కవ శాతం సికింద్రాబాద్‌కు వస్తారని, అందుకే ట్రైన్‌ను సిద్దిపేట-సికింద్రాబాద్‌ల మధ్య నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్యాసింజర్‌ రైలు నెంబర్ 07483గా తెలిపిన రైల్వే అధికారులు.. ఈ ట్రైన్‌ సిద్దిపేటలో ఉదయ 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 10 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందని స్పష్టం చేశారు.

మళ్లీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరీ అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు ప్రయాణికులను సిద్దిపేటకు తీసుకువెళ్లనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట నుంచి బయలు దేరనున్న ఈ రైలు.. సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులతో రానుంది. మరో 30 నిమిషాల గ్యాప్‌ అనంతరం సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరనున్న ఈ రైలు.. రాత్రి 8 గంటల 40 నిమిషాలకు సిద్దిపేట చేరుకోనుంది. సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య 116 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన ఈ రైలు మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్‌, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌, మనోహరాబాద్‌, నాచారం, బేగంపేట, గజ్వేల్‌, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట స్టేషన్స్‌లో ఆగనుంది. ఈ ట్రైన్‌కు సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేటకు టికెట్ ధర 60 రూపాయలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. ట్రైన్‌ సర్వీస్‌తో సిద్దిపేట నుంచి హైదరాబాద్‌ వచ్చే ప్రయాణికుల జర్నీ సులువు కానుంది.

ALSO READ: జగన్‌కు పోయే కాలం దగ్గరపడింది

Advertisment
Advertisment
తాజా కథనాలు