నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎయిర్ పోర్టు అథారిటీలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. సైన్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లకు ఏడాదికి రూ. 13లక్షల జీతం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన వివరాలు :
మొత్తం ఖాళీలు : 496
అర్హతలు:
మ్యాథ్స్ , ఫిజిక్స్ తోపాటు బీఎస్సీ లేదా బీఈ, బీటెక్ లో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ భాషలో రాత, మాట్లాడే నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి.
వయస్సు:
నవంబర్ 30, 2023 నాటికి 27ఏళ్లు నిండి ఉండాలి. దివ్యాంగులకు 10ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్ల సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ : నవంబర్ 30, 2023
దరఖాస్తు ఫీజు:
రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
పరీక్ష తేదీ: త్వరలోనే ప్రకటిస్తారు.
ఉద్యోగ బాధ్యతలు:
ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థల్లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. ఎయిర్ పోర్టుల సమర్థ నిర్వహణలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలో సేవలే కీలకం. ఈ విభాగంలో ఎంపికైనవారు కార్యాలయాల్లో ఉంటూ విమానరాకపోకలు పర్యవేక్షిస్తూ ప్రయాణం సాఫీగా సాగేవిధంగా చూస్తారు. ఇందుకు గాను వారికి రూ. 40వేలు జీతం అందుతుంది. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రోత్సాహకాలు కూడా అదనంగా ఉంటాయి. అన్నీ కలిపి వీరు రూ. 13లక్షల వార్షిక వేతనం పొందుతారు.
ఎంపిక విధానం:
మొదట ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ధ్రవపత్రాల పరిశీలనతోపాటుగా వాయిస్ టెస్టు కూడా ఉంటుంది. అనంతరం సైకోయాక్టివ్ సబ్ స్టాన్సెస్ టెస్టు, సైకలాజికల్ అసెస్ మెంట్ పరీక్ష, మెడికల్ టెస్టు, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. వీటిలోనూ అర్హత సాధించాలి. ఫైనల్ సెలక్ష్స్ రాత పరీక్షతోపాటు సంబంధిత విభాగాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా చేపడతారు. ఈ పోస్టులకు సెలక్ట్ అయిన వారు దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో చేరేవారు ట్రైనింగ్ అనంతరం కనీసం 3ఏళ్లపాటు కొనసాగాల్సి ఉంటుంది. దీనికోసం రూ. 7లక్షల విలువైన ఒప్పంద పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది.
ఇక పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్ హిందీలో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున 120 మార్కులు ఉంటాయి. పరీక్ష 2గంటల పాటు ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఇదేందయ్య ఇది.. ఇలాంటి క్యాచ్ నేనెప్పుడూ చూడలా.. వైరల్ వీడియో!