Cricket Videos: ఇదేందయ్య ఇది.. ఇలాంటి క్యాచ్ నేనెప్పుడూ చూడలా.. వైరల్ వీడియో! By Trinath 14 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి CRICKET VIRAL VIDEOS: క్రికెట్‌లో చిత్రవిచిత్రమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మన కళ్లతో మనమే నమ్మలేం. ఇలా కూడా అవుట్ అవుతారా.. ఇదేం క్యాచ్ రా బాబు.. అదేం రన్నింగ్ బాబోయ్.. అంటూ జనాలు ఎక్కువగా చర్చించుకునే వీడియోలు నెట్టింట్లో దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం వరల్డ్‌కప్ సీజన్ నడుతస్తుండడంతో క్రికెట్ వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లవే కాకుండా గల్లి స్థాయి, క్లబ్ క్రికెట్‌కు సంబంధించిన ఇంట్రస్టింగ్ వీడియోలను షేర్ చేస్తున్నాయి మీమ్ పేజీలు. అలాంటి ఆసక్తికర వీడియో ఒకటి సోషల్‌మీడియాలో షేర్ అవుతోంది. ఇదేం క్యాచ్ భయ్యా: 'మన పాల్వంచ Palvancha PVC' అనే ఫేస్‌బుక్ పేజ్ ఇంట్రస్టింగ్ వీడియోలు షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా క్రికెట్ వీడియోలు చాలా పోస్ట్ చేస్తుంటుంది. అందులో ఫన్నీ వీడియోలతో పాటు ఇన్ఫర్‌మేటీవ్ వీడియోలు కూడా ఉంటాయి. ఇక తాజాగా ఈ పేజీ నుంచి ఓ వీడియో షేర్ అవ్వగా.. అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వాళ్లు.. ఇదేందయ్య ఇది.. ఇలాంటి క్యాచ్ నేనెప్పుడూ చూడలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్యాచ్ చేతులతోనే పట్టాలా ఏంటి? ఇది ఏ రెండు టీమ్‌ల మధ్య మ్యాచో తెలియదు కానీ వికెట్ కీపర్ క్యాచ్ చూసి అంతా నవ్వుకుంటున్నారు. బౌలర్ ఫ్లైట్ డెలవరీ వెయ్యగా.. బ్యాటర్ కంప్లీట్‌గా బీట్ అయ్యాడు. స్లో డెలవరీకి బోల్తా పడ్డాడు. బాల్ కాస్త బ్యాట్‌కు ఎడ్జ్ అయ్యింది. స్లిప్ సైడ్‌గా వెళ్తున్న బంతి కోసం కీపర్ డైవ్ చేశాడు. బంతి ముందుగా కీపర్ గ్లోవ్‌కి టచ్ అయ్యింది. వెంటనే అందులో నుంచి జారింది. ఇంకేముంది క్యాచ్ డ్రాప్‌లే అనుకున్నారు. కానీ అక్కడే మ్యాజిక్ జరిగింది. డైవ్ చేసిన కీపర్ కిందపడ్డాడు. గ్లోవ్ లో నుంచి స్లిప్ అయ్యిన బాల్ కాస్త వెళ్లి కీపర్ భూజలను తాకుకుంటూ బ్యాక్ సైడ్ డొర్లింది. బాల్ అక్కడే ఆగిపోయింది. గ్రౌండ్‌కు టచ్ అయ్యేలోపు మిగిలిన ఫీల్డర్లు వచ్చి బాల్‌ను పట్టుకున్నారు. ఇంకేముంది అవుట్.. బ్యాటర్ షాక్.. కీపర్ రాక్స్..! Also Read: మరోసారి అదే జరిగితే రియల్ చోకర్స్ మనమే.. టీమిండియాకు పట్టుకున్న ఆ టెన్షన్! WATCH: #india-vs-newzealand #cricket #cricket-videos #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి