Scholarship: విద్యార్థులకు శుభవార్త...స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!!

చదువుకోవాలన్న కోరిక, ఆసక్తి ఉన్నా ఎంతోమంది ప్రతిభావంతులకు పేదరికం కారణంగా చదవుకు దూరం అవుతున్నారు. అందులోనూ ఆడపిల్లల పట్ల మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు ఈ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకుని...వారికి ఆర్థికంగా సాయం చేయడంతోపాటు చదువులో రాణించేలా విప్రో సంస్థ సంతూరు స్కాలర్ షిప్స్ ను అందిస్తోంది.

Scholarship: విద్యార్థులకు శుభవార్త...స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!!
New Update

చదువుకోవాలన్న కోరిక, ఆసక్తి ఉన్నా ఎంతోమంది ప్రతిభావంతులకు పేదరికం కారణంగా చదవుకు దూరం అవుతున్నారు. అందులోనూ ఆడపిల్లల పట్ల మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు ఈ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకుని...వారికి ఆర్థికంగా సాయం చేయడంతోపాటు చదువులో రాణించేలా విప్రో సంస్థ సంతూరు స్కాలర్ షిప్స్ ను అందిస్తోంది. ఈ స్కాలర్ షిప్ పొందాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియేట్ పూర్తిచేసి...యూజీ కోర్సుల్లో చేరిన విద్యార్థినిలు అప్లయ్ చేసుకోవచ్చు. వీటిని విప్రో కేర్స్, విప్రో కన్సూమర్ కేర్, అండే లైటెనింగ్ గ్రూప్ కలిసి అందిస్తున్నాయి.

ఈ స్కాలర్ షిప్ విధానం 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి 19వందల మంది విద్యార్థినులకు ఈ స్కాలర్ షిప్ కు ఛాన్స్ కలిపించనున్నారు. గత ఏడేళ్లలో 6వేల మంది విద్యార్థినులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈ తోడ్పాటుతో ఉన్నత విద్యలో రాణిస్తున్నారు.

ఇది కూడా చదవండి: టెట్ ఫలితాలపై గందరగోళం.. అభ్యర్థుల ఆందోళన…!!

అర్హతలు:
ఈ స్కాలర్ షిప్ కు పదో తరగతి, ఇంటర్మిడియేట్ పూర్తి చేసిన విద్యార్థినిలు అర్హులు. వీళ్లు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదువుకుని ఉండాలి. ఆర్థికంగా వెనకబడిన బాలికలకు మాత్రమే ఈ స్కాలర్ షిప్ అప్లయ్ చేసుకునేందుకు అర్హులు. 2022-23 విద్యాసంవత్సరలో ఇంటర్ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసి ఉండాలి. 2023-24లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సులో చేరి ఉండాలి. కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సులో చేరినవారికే ఈ స్కాలర్ షిప్స్ పొందుతారు. మూడేళ్లు కోర్సు పూర్తయ్యేంత వరకు ప్రతినెలా రెండువేల రూపాయలు ఎంపికైన విద్యార్థిులు ప్రోత్సాహంగా అందిస్తారు. విద్యార్థినుల బ్యాంకు ఖాతాలోకి కానీ వారి తల్లిదండ్రుల ఖాతాలోకి కానీ జమ చేస్తారు. ఇలా ఏడాదికి 24వేల రూపాయలు అందిస్తారు.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అలర్ట్…600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ…!!

ఈ స్కాలర్ షిప్స్ కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థినులు అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపాలి. పోస్టు ద్వారా పంపించాలి. దీనికోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తులు సమర్పించడానికి మొదట్లో సెప్టెంబర్ 30తో చివరి తేదీ నిర్ణయించగా...తాజాగా అక్టోబర్ 15 వరకు గడువును పొడిగించారు.విద్యార్థినులు తమ దరఖాస్తును పంపించేందుకు https://www.santoorscholarships.com/ సందర్శించి అందులో ఉన్న అడ్రెస్ కు పోస్టు చేయవచ్చు.

#scholarships #jobs #career-and-courses
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి