Sankranti Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్. సంక్రాంతి పండుగకు ఈసారి భారీగా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. ఏపీ (AP)లో వరుసగా 13రోజులు సెలవులు వస్తున్నాయి. తెలంగాణ (Telangana)లో దాదాపు వారం రోజుల పాటు సెలవులు వచ్చాయి. తెలంగాణ సర్కార్ పాఠశాలలకు జనవరి 12నుంచి సెలవులు ప్రకటించింది. అంటే దాదాపు 6రోజులు సెలవులు ఇచ్చింది. జూనియర్ కాలేజీల(Junior colleges)కు కూడా మొత్తం 4 రోజులు సెలవులు ప్రకటించింది. వీరికి ఈనెల13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. అకాడమిక్ క్యాలెండర్(Academic Calendar) లో అంతకుముందు ఓసారి ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరోసారి వెల్లడించారు.
అయితే అన్ని ప్రైవేట్ కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. సెలవు రోజుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని బోర్డు కార్యదర్శి హెచ్చరించారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించారు. ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంటే వారం రోజులు సెలవులు వచ్చాయి. ఏపీలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు పదిరోజులు ఉన్నాయి. జనవరి 9 నుంచి జనవరి 18 వరకు సెలవులు ఉంటాయని అధికారులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యార్థులకు పదిరోజులు సంక్రాంతి సెలవులు వచ్చాయి. అంటే ఏపీలో పాఠశాలలు తిరిగి జనవరి 19న ప్రారంభం అవుతాయి. 19,20వ తేదీల్లో కూడా సెలవు తీసుకుంటే...ఆ తర్వాత రోజు ఆదివారం వస్తుంది. ఇలా మొత్తం 13రోజులు సంక్రాంతికి సెలవులు వస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా వరుసగా సెలవులు వచ్చాయి. ఈరోజు నుంచి జనవరి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో సంక్రాంతి సెలవులు ఈనెల 21 వరకు పొడిగించినట్లు సమాచారం. జనవరి 22 సోమవారం నుంచి పాఠశాలకు, కాలేజీలకు విద్యార్థులు వెళ్లాల్సి ఉంటుంది.