ఏపీ ప్రభుతవం పెన్షనర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చినట్లుగా ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో చెప్పిన పథకాలన్నింటిని కూడా ఇప్పటి వరకు సుమారు 98 శాతం నెరవేర్చామని ఇప్పటికే వైసీపీ మంత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ నవరత్నాల్లోని వైఎస్సాఆర్ పెన్షన్ ఒకటి.
జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ పథకం కింద వృద్దులకు, వికలాంగులకు , ఒంటరి మహిళలకు , ట్రాన్స్ జెండర్లకు, వితంతువులకు పెన్షన్ అందిస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం అంతే కాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఆరు నెలలకు పెన్షన్ ను క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది.
ఇప్పటి వరకు వైఎస్సాఆర్ పెన్షన్ కానుక కింద నెలకు రూ. 2750 అందిస్తుండగా..ఇప్పుడు ఆ పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం..2024 మొదటి రోజు నుంచే ఈ 3 వేల రూపాయల పెన్షన్ అమల్లోకి వస్తుంది.
ఈ క్రమంలోనే ఏపీ వాలంటీర్లకు కూడా ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్తను అందించింది. వారికి జనవరి 1 నుంచి జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నేడు జగన్ పుట్టిన రోజు కానుకగా ఈ బహుమానాన్ని ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈ విషయాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జనవరి 1 నుంచి వాలంటీర్లకు 5 వేల నుంచి 5 వేల 750కి పెంచుతున్నట్లు మంత్రి వివరించారు.
Also read: తారక్ కి అరుదైన గౌరవం.. ఆ లిస్టులో పేరు సంపాదించుకున్న ఏకైక తెలుగు నటుడు!