యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.. జాన్వీ హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది.
కాగా ఈ చిత్రానికి సంబందించిన రిలీజ్ డేట్ పై మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై సుధాకర్ మిక్కిలినేని, కే. హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక మరో వైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అయితే ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏప్రిల్ నుంచే సినిమా మొదలు కావాల్సి ఉంది కాని పలు కారణాలతో అది సాధ్య పడలేదు. అయితే ఇప్పుడు సినిమా షూట్ ఎప్పుడు అనే దానిపై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. దాని ప్రకారం ఎన్టీఆర్-నీల్ సినిమా ఈ ఏడాది ఆగస్టు నుంచి మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది. ఈలోపు ఎన్టీఆర్ “వార్ 2” లో తన పాత్ర పోర్షన్‌ను కంప్లీట్ చేసుకుంటారట.
ఇక మరోవైపు హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూట్ ఇప్పటికే ప్రారంభం అవ్వగా, హృతిక్ రోషన్ పై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటికే పలు సీన్స్ చిత్రీకరించారు. ఇక ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా టాక్. అంతే కాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా లాభాల్లో వాటాను దక్కించుకునేలా ఒప్పందం కుదిరినట్లుగా టాక్ నడుస్తోంది. ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఓవర్ సీస్ డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దేవర సినిమా ఓవర్సీస్ రైట్స్ 27 కోట్ల మేరకు క్లోజ్ అయ్యి బజ్ వినిపిస్తోంది. ఇక నైజాలో మాత్రం 50 కోట్ల రేంజ్లో రేట్ కోట్ చేస్తున్నారట నిర్మాతలు.. అయితే ఈ రైట్స్ కోసం దిల్ రాజు గట్టిగానే ప్రయత్నం చేస్తు్న్నారట. అంతేకాదు దాదాపుగా దిల్ రాజు డీల్ క్లోజ్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది. జాన్వీ హీరోయిన్గా చేస్తోంది. భారీ అంచనాలపై వస్తున్న ఈ సినిమాపై నెక్స్ట్ లెవల్లో అంచనాలున్నాయి. రెండు పార్ట్‌లుగా వస్తోంది. ఇక మొదటి భాగం దసరాకు అక్టోబర్‌లో విడుదల కానుందని ప్రకటించారు.ఇక ఈ చిత్రం ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.