UPSC Notification : మీరు ఇంటర్ పాసయ్యారా.. అయితే అదిరిపోయే శుభవార్త మీకోసమే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ (Nation Defense Academy) అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ (Naval Academy Examination 2024 Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 404 పోస్టుల ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం...
ఈ ఖాళీలకు అర్హులైన పెళ్లికానీ పురుష, మహిళా అభ్యర్థులు మే 15వ తేదీ నుంచి.. జూన్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు (Online Applications) సమర్పించవచ్చు. ఆ తర్వాత 5 నుంచి 11 వరకు అప్లికేషన్ లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సరిచేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు మొత్తం ఖాళీల సంఖ్య..
నేషనల్ డిఫెన్స్ అకాడమీ: 370 పోస్టులు ( నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120,ఆర్మీ-208)
నేవల్ అకాడమీలో (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 34
అర్హతలు.. ఆర్మీ పోస్టులకు ఇంటర్ పాసై ఉండాలి.. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
వయోపరిమితి..
అభ్యర్థులు 02.01.2006 – 01.01.2009 మధ్య పుట్టి ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి..
దరఖాస్తు ఫీజు…
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే వారు ముందుగా ఆన్ లైన్ లో 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం..
అభ్యర్థులకు రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవాలి.. ఆఖరి తేదీ జూన్ 4.