క్రికెట్ అభిమానులకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 10న ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. కొలంబో వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటిస్తున్నట్లు ఏసీసీ తెలిపింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. మ్యాచ్ ఎన్ని ఓవర్ల వద్ద ఆగిపోందో.. సెప్టెంబర్ 11న తిరిగి ఆ ఓవర్ల నుంచి ప్రాంభిస్తామని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆదివారం ఒక్క రోజు కోసమే టికెట్లు కోనుగోలు చేసిన అభిమానులకు రిజర్వ్ డే రోజు సైతం స్టేడియంలోకి అనుమతి ఇస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తేల్చి చెప్పింది.
మరోవైపు సెప్టెంబర్ 2 టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడింది. దాయాదుల మధ్య జరిగిన పోరులో టాప్ ఆర్డర్ విఫలమైనా మిడిలార్డ్ రాణించడంతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ అయిపోగానే భారీ వర్షం మొదలైంది. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అనంతరం సెప్టెంబర్ 4న నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.
కాగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండు బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్‌ని షాహీన్ ఆఫ్రిది క్లిన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీని సాగనంపాడు. కేవలం 4 పరుగులే చేసిన కోహ్లీ షాహీన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ నిరాశ పరిచాడు. రెండు ఫోర్లతో దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టిన అయ్యార్ హారీశ్ రౌఫ్ బౌలింగ్‌లో ఫకర్ జమాన్‌కి దొరికిపోయాడు. ఆ తర్వాత గిల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో గిల్ బ్యాటింగ్ చాలా దారుణంగా అనిపించింది. 32 బంతులాడిన గిల్ కేవలం 10 పరుగులే చేశాడు. ఒక్క బౌండరీ మాత్రమే బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 31గా మాత్రమే రికార్డయింది.
Also Read: పాకిస్థాన్ ఆటగాళ్లతో అతిస్నేహం వద్దు