Flight Tickets: విమాన ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన టికెట్ ధరలు ?

DGCA కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థలు అందించే సేవల ఛార్జీల కోసం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల కారణంగా ఫ్లైట్ టికెట్ల ధరలు చాలా వరకు తగ్గనున్నాయి. ఆ కొత్త రూల్స్ ఏవో తెలుసుకుందాం.

Flight Tickets: విమాన ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన టికెట్ ధరలు ?
New Update

కొత్త విమానయాన సంస్థల ప్రవేశంతో ఇటీవల కాలంలో ఫ్లైట్ టికెట్ ఛార్జీలు కొంత వరకు తగ్గాయి. ఈ రంగంలో పోటీ పెరగడమే ఇందుకు కారణం. అయితే ఫ్లైట్ టికెట్‌ ధరలను మరింత తగ్గించేందుకు ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)’ కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థలు అందించే సేవల ఛార్జీల కోసం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల కారణంగా ఫ్లైట్ టికెట్ల ధరలు చాలా వరకు తగ్గనున్నాయి. ఆ కొత్త రూల్స్ ఏవో తెలుసుకుందాం.

DGCA తాజా నిబంధనల ప్రకారం, కొన్ని సేవలకు విమానయాన సంస్థలు విడిగా ఛార్జీ విధించవచ్చు. అయితే ఆ సర్వీసులు (Unbundled services) ప్రయాణికులకు ఆప్ట్-ఇన్ (Opt-in) ఆధారంగా మాత్రమే అందించాలి. అంటే, ప్రయాణికులు కోరుకునే సేవలను మాత్రమే ఎంచుకొని డబ్బు చెల్లించవచ్చు. అలానే అన్ని సేవలను తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ప్రయాణికులకు ఈ మేరకు డబ్బు ఆదా అవుతుంది.

విమానయాన సంస్థలు బ్యాగేజీ, ప్రాధాన్యత కలిగిన సీట్లు (Preferential seating), మీల్స్ /స్నాక్స్/డ్రింక్స్, సంగీత వాయిద్య పరికరాల రవాణా కోసం విడిగా ఛార్జీలు విధించవచ్చు. ఈ సేవలను విమానయాన సంస్థలు టికెట్ ఛార్జీలలో ఆప్ట్-ఇన్ సర్వీస్‌లుగా మాత్రమే అందించాలి.విమానయాన సంస్థలు టికెట్ ఛార్జీలలో ప్రయాణ బీమా లేదా సీటు సెలక్షన్ వంటి కొన్ని ఎక్స్‌ట్రా సర్వీస్‌లు లేదా ఛార్జీలను ఆటోమేటిక్‌గా యాడ్ చేస్తాయి. వీటిని ఆప్ట్-అవుట్ చేసుకోవచ్చు. వాటిని స్పష్టంగా తిరస్కరించకపోతే, వీటి కోసం కూడా ఛార్జీలు చెల్లించుకోక తప్పదు. ఆప్ట్-ఇన్ అంటే.. టికెట్ బుక్ చేసేటప్పుడు కావాల్సిన ఎక్స్‌ట్రా సర్వీసులు లేదా ఫీచర్లను మ్యానువల్‌గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

“ప్రయాణికుల నుంచి అందిన అభిప్రాయాల ఆధారంగా, చాలా సందర్భాల్లో ఆప్ట్-ఇన్ సర్వీస్‌లు ప్యాసింజర్లకు అవసరం లేదని తెలిసింది. ఎయిర్‌లైన్స్‌ అందించే ఈ సేవలను వేరు చేసి, వాటికి ఆప్షనల్ ఆధారంగా ఛార్జీలు విధించడం ద్వారా, ప్రాథమిక టికెట్ ధర తక్కువగా ఉండే అవకాశముంది.” అని DGCA ఒక ప్రకటనలో చెప్పింది. ఆ ఛార్జీలు ఏవో చూద్దాం.

ఎయిర్‌లైన్స్‌ అందించే మీల్స్/స్నాక్స్/డ్రింక్స్‌ (కూల్ వాటర్ మినహాయింపు)

- క్రీడా పరికరాల ఛార్జీలు

- సంగీత వాయిద్య పరికరాల రవాణా ఛార్జీలు

- ఎయిర్‌లైన్ లాంజ్‌లు ఉపయోగించినందుకు ఛార్జీలు

- ఖరీదైన బ్యాగేజీ కోసం ప్రత్యేక ప్రకటన ఫీజు (విమానయాన సంస్థ బాధ్యత పరిమితిని పెంచడానికి)

- బ్యాగేజీ ఛార్జీలు

* ఛార్జీల మార్పులలో జాగ్రత్తలు

తాజా నిబంధనల ప్రకారం సంస్థలు సేవల గురించి స్పష్టంగా వివరించాలి. ప్రయాణికులు ఏ సేవలు కావాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు సమాచారం ఉండాలి. టికెట్ బుక్ చేసేటప్పుడు ఎంచుకునే సేవలకు మాత్రమే డబ్బు వసూలు చేయాలి. క్రీడాకారులు, కళాకారులకు ప్రత్యేక రాయితీలు ఉండొచ్చు. ప్రతి సేవకు ఛార్జీలు స్థిరంగా ఉంటాయి. సంస్థలు 30 రోజుల ముందుగా మార్పులు తెలియజేయాలి. వెబ్‌సైట్‌లో సర్వీసులు, ఛార్జీల వివరాలు స్పష్టంగా చూపించాలి. ఆప్ట్-ఇన్ సేవలు ఎంచుకోకుండా టికెట్ బుక్ చేసుకునే వీలు ఉందని తెలియజేయాలి. ట్రావెల్ ఏజెంట్లు కూడా సమాచారం చూపించాలి.

దివ్యాంగులకు చక్రాల కుర్చీ వంటి సహాయం అందించడంలో వివక్షత ఉండకూడదు. ముందుగా చెల్లించిన సేవ అందించకపోతే డబ్బు తిరిగి చెల్లించాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి సీట్లు కేటాయించాలని DGCA విమానయాన సంస్థలను ఆదేశించింది.

#flight-tickets #flights #offers #latest-offers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe