Gold Scam : హైదరాబాద్‌లో రూ.100 కోట్ల గోల్డ్ స్కాం.. అధిక లాభాల ఆశతో..

హైదరాబాద్ లో భారీ గోల్డ్ స్కాం వెలుగుచూసింది. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ సుమారు 500 మంది నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి పారిపోయాడు. హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు.

New Update
Gold Scam : హైదరాబాద్‌లో రూ.100 కోట్ల గోల్డ్ స్కాం.. అధిక లాభాల ఆశతో..

Hyderabad : హైదరాబాద్‌లో తాజాగా మరో ఘరానా మోసం చవి చూసింది. అధిక లాభాలు ఆశ చూపి గోల్డ్ ట్రేడింగ్ (Gold Trading) లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన చెప్పట్టారు. అధిక లాభాలు ఆశ చూపి సుమారు 500 మందిని ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ మోసం చేసాడు. హబ్సిగూడా లో ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి నుండి రూ. 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేసి రాజేష్ పరారైయ్యాడు. ఇన్వెస్ట్మెంట్ (Investment) అమౌంట్ ను ఐదు నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని రాజేష్ నమ్మించారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లో 2 శాతం లాభాలను వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.పెట్టిన సొమ్ముకు ఐదు నెల్లో రెట్టింపు ఇస్తానని రాజేష్ బాధితులకు నమ్మబలికాడు. తొలుత లాభాలు ఇవ్వగా ఇదంతా నిజమే అని నమ్మి మరింత మంది ఈ స్కీమ్ లో చేరారు. అలాగే రెండు నెలల పాటు లాభాలను రాజేష్ చెల్లించాడు.దాంతో నమ్మకం కలగడంతో పెద్ద మొత్తంలో బాధితులు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ డబ్బులతో తాజాగా రాజేష్ ఉడాయించాడు. గత రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్ ను ఆదివారం సీసీఎస్ పోలీసులు (CCS Police) అరెస్ట్ చేసారు. తమకు న్యాయం చేయాలని సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన చేశారు.

పెట్టిన సొమ్ముకు ఐదు నెల్లో రెట్టింపు ఇస్తానని రాజేష్ బాధితులకు నమ్మబలికాడు. తొలుత లాభాలు ఇవ్వగా ఇదంతా నిజమే అని నమ్మి మరింత మంది ఈ స్కీమ్ లో చేరారు. అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.5 లక్షల నుంచి మొత్తంగా రూ. 100 కోట్ల వరకూ వసూలు చేసిన రాజేశ్.. ఆ తర్వాత పరారయ్యాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.

Also Read : తెలంగాణలో దారుణం.. పొలం పనికి రావడం లేదని గిరిజన మహిళ ప్రైవేట్ పార్ట్స్ పై..

Advertisment
తాజా కథనాలు