Gold Rates Review : పదిరోజుల్లో 3 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. ఇప్పుడేం చేయాలి?

బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. అందుకు కారణాలు ఏమిటి? బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఇప్పుడు బంగారం కొనవచ్చా? బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారు? ఈ విషయాలను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

Gold Rates Review : పదిరోజుల్లో 3 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. ఇప్పుడేం చేయాలి?
New Update

Gold Rates Review : బంగారం ధరలు(Gold Rates) ఆల్ టైమ్ హైలో పరుగులు తీస్తున్నాయి. మార్చి నెల ప్రారంభం నుంచి వరుసగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత పది రోజుల్లో పది గ్రాముల బంగారం దాదాపుగా 3 వేల రూపాయల వరకూ పెరిగింది. దీంతో బంగారం కొనాలని అనుకునేవారికి షాక్ తగిలింది. బంగారంలో ట్రేడింగ్ చేసేవారికి మాత్రం లాభాల సంతోషం కలుగుతోంది. ఈ పదిరోజుల్లో బంగారం ధరలు ఎలా పెరిగాయో ఒకసారి చూద్దాం. మార్చి 1వ తేదీన హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 57,590 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 62,830 రూపాయలు. ఇప్పుడు అంటే 8వ తేదీ మార్కెట్లు ముగిసేసరికి బంగారం ధర 22 క్యారెట్లు 60,250 రూపాయలుగా, 24 క్యారెట్లు 65,730 రూపాయలుగానూ ఉంది. అంటే ఈ పదిరోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర(Gold Rates Review) దాదాపుగా 2,660 రూపాయలు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర దాదాపుగా 2900 రూపాయలు ఎగసింది. అంటే ప్రతిరోజూ దాదాపు 300 రూపాయల చొప్పున పెరుగుతూ వస్తోంది. 

ఎందుకు ఇలా పెరుగుతున్నాయి..
ప్రపంచంలో అనిశ్చితి పరిస్థితుల్లో బంగారం ధరలు(Gold Rates Review) పెరగడం సాధారణంగా జరుగుతుంది. అదేవిధంగా యూఎస్ ఫెడ్ రేట్స్(US FED Rates) తగ్గుతాయి అని తెలిసినపుడు.. లేదా తగ్గినపుడు బంగారం ధరలు తగ్గడం సహజమే. ఎందుకంటే.. ఆర్థిక అనిశ్చితి పెరిగినపుడు ఇన్వెస్టర్స్ ఇతర పెట్టుబడుల కన్నా.. బంగారంలో పెట్టుబడి పెట్టడం సేఫ్ అనుకుంటారు. అలానే, అమెరికాలో వడ్డీరేట్లు (ఫెడ్ రేట్స్) ప్రభుత్వం తగ్గించినపుడు.. ఇన్వెస్టర్స్ బంగారం పై ఇన్వెస్ట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అందుకే ఈ రెండు సందర్భాల్లోనూ బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా స్థానికంగా ఉండే పరిస్థితులు.. డిమాండ్ ఆధారంగా కూడా బంగారం ధరలలో మార్పులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగారం ధరలు(Gold Rates Review) పెరగడానికి ఇవన్నీ కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఒక పక్క ప్రపంచంలో అనిశ్చితి పరిస్థితులు ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయేల్ యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఎకానమీ పై పెద్ద ప్రభావమే చూపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో అమెరికా, భారత్ వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుదల నమోదు చేసింది. దీంతో సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. యూఎస్ ఫెడ్ ఈసారి వడ్డీరేట్లను తగ్గిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఇన్వెస్టర్స్ బంగారంవైపు చూస్తున్నారు. ఇక భారత్ లో బంగారం ధరలు అంతర్జాతీయ ధరలపై ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే, ఎక్కువ మొత్తంలో బంగారం దిగుమతులు చేసుకుంటుంది భారత్. మరోవైపు భారత్ లో పెళ్లిళ్ల సీజన్ జోరుగా ఉంది.. ఇన్ని సానుకూలతలు మధ్య బంగారం ధరలు రయ్యిన దూసుకుపోతున్నాయి. 

బంగారం కొంటున్న సెంట్రల్ బ్యాంకులు.. 
ఇక బంగారం ధరలు పెరగడానికి మరోకారణం కూడా నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలలో సెంట్రల్ బ్యాంకులు బంగారాన్నిభారీగా కొనుగోలు చేస్తున్నాయి. చైనా ఇటీవల కాలంలో రికార్డ్ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేసింది. మన రిజర్వ్ బ్యాంక్ కూడా 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది కూడా బంగారం ధరలు(Gold Rates Review) పెరగడానికి ఒక కారణంగా  చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు.  

Also Read : బంగారం కొనాలంటే ఇప్పట్లో అయ్యేలా లేదు.. ధరల మోత ఆగడం లేదు!

ఇప్పుడు బంగారం కొనవచ్చా?
బంగారం ధరలు దూసుకుపోతున్న నేపథ్యంలో సాధారణ ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు బంగారం కొనవచ్చా? అనే సందేహం రావడం సహజం. అయితే, ప్రస్తుతానికి వేచి ఉండడమే మంచిది అని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు పరుగులు తీస్తున్నా.. సమీప కాలంలో కరెక్షన్ తీసుకునే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇన్వెస్ట్ చేయడానికి కాస్త ఆగితే బెటర్ అని వారు సూచిస్తున్నారు. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారు కొన్నిరోజులు ఆగడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే బంగారంపై పెట్టుబడి పెట్టినవారు లాభాల స్వీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బంగారంపై ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం సరికాదని నిపుణులు అంటున్నారు. కానీ, ఇప్పటికే తమ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ ఫోలియోలో  5% శాతం కంటే ఎక్కువ గోల్డ్ ఉన్నవారు ఎక్కువగా ఉన్న బంగారాన్ని అమ్ముకోవడం మంచిదే అని వారు చెబుతున్నారు. 

ధరల కారణంగా తగ్గుతున్న డిమాండ్..
ఒకపక్క పెళ్లిళ్ల సీజన్ జోరుగా ఉన్నా.. మన దేశంలో బంగారానికి డిమాండ్ ఆ స్థాయిలో లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ధరలు(Gold Rates Review) బాగా పెరిగిపోవడం బంగారం కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపించిందని చెబుతున్నారు. స్క్రాప్ బంగారం.. అంటే.. పాత బంగారాన్ని.. కొత్త బంగారంతో మార్చుకోవడం ఎక్కువగా జరుగుతోందని మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఒక్కసారి అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలంగా మారితే, బంగారం ధరలు దిగివచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.

#gold #investment #gold-rate-in-india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe