Gold Rates Hike Today : బంగారం ప్రియులకు షాక్. మరోసారి బంగారం ధరలు (Gold Rates) పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల (International Markets) ప్రభావం, శ్రావణ మాసం (Shravan Masam) దగ్గర పడుతుండడంతో బంగారం ధరలు ఆకాశానికి నిచ్చన వేస్తున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉండడంతో బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతుంటారు. కాగా ఇదే సమయంలో బంగారం ధరలు పెరగడం పసిడి ప్రియులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
హైదరాబాద్ (Hyderabad) లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,410 వద్ద ఉంది. మేలిమి బంగారం ధర రూ.69,170గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,410గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,170గా ఉంది. ఢిల్లీ, ముంబై, పుణెలో కిలో వెండి ధర రూ.84,400కి చేరింది. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.88,900గా ఉంది.
దేశంలో ఇలా..
దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,170గా ఉంది. సోమవారం 69,140గా ఉంది. బంగారంతోపాటు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.100 వరకు పెరిగింది. బంగారం, వెండి సహా పలు ఉత్పత్తులపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకం తగ్గించిన సంగతి తెలిసిందే.
Also Read : బంగారం ధరలు మళ్ళీ పరుగులు.. కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్