Gold Rates : గోల్డ్ లవర్స్ రిలాక్స్.. బంగారం ధర తగ్గింది.. వెండి కూడా.. 

వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,350ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,560ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.75,400 వద్ద ఉంది.

Gold Rate Hike: బంగారం ధరలు మళ్ళీ పరుగులు.. కొనాలంటే ఇదే బెస్ట్ టైమ్ 
New Update

Gold Rates Today : వరుసగా పెరుగుతూ గోల్డ్ లవర్స్ ని కంగారు పెట్టిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్(Wedding Season) ప్రారంభం అయింది. దీంతో బంగారం ధరలు పెరగడం మొదలయింది. బంగారం ధరల పెరుగుదల చూసి అందరూ టెన్షన్ పడ్డారు. కానీ, ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గుదల కనబరిచి ఊరట కలిగిస్తున్నాయి.  బంగారం, వెండి ధరలు(Gold Rates) నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రజలు బంగారం కొనడం విషయంలో ఆలోచన చేస్తుండడంతో డిమాండ్ నిదానించింది. దీంతో స్థానికంగా బంగారం ధరలు కాస్త తగ్గాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Rates) తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు నిన్ననిలకడగా ఉన్న వెండి ధరలు కూడా ఈరోజు తగ్గుదల కనబరిచాయి.  ఈరోజు అంటే బుధవారం (ఫిబ్రవరి 21) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.         

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో వరుసగా మూడురోజులుగా పెరుగుతూ వచ్చిన  బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గుదల(Gold Rates) కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price) స్వల్పంగా 100 రూపాయలు తగ్గి రూ.57,350ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 110 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 62,560లకు దిగివచ్చింది.  

ఢిల్లీ లో ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి రూ.57,500ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 10 గ్రాములకు 110 రూపాయలు తగ్గింది.  దీంతో  రూ.62,710ల వద్ద కు చేరింది. 

Also Read :  బంగారం ధర మళ్లీ పెరిగింది.. వెండి కాస్త తగ్గింది.. ఈరోజు ఎంతంటే.. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Rates) తగ్గుదల కనపరుస్తుంటే మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు తగ్గాయి.  హైదరాబాద్ లో వెండి కేజీకి 100 రూపాయలు తగ్గి రూ.75,400ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు కేజీకి 100 రూపాయలు తగ్గింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,900లకు దిగివచ్చింది. 

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Rates Drop) వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price Today)  2025 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23.01 డాలర్లుగా కొనసాగుతోంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this Interesting Video :

#gold #delhi #gold-rates-today-in-hyderabad #gold-and-silver
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe